తాడికొండ: విఐటి– ఏపీ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గవిరిపాటి సాయికృష్ణ(19) మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ–2 అంజయ్య కళాశాలకు వెళ్ళి పరిశీలించగా ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయినట్లు నిర్థారించారు. విద్యార్థిని తల్లిదండ్రులు తెలంగాణకు చెందిన వారు కావడంతో సమాచారం అందించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందా లేక మరేమైనా ఉందా అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.