ఒత్తిడికి మూలం డబ్బేనా..!? | ​health tips: Traders hormones may destabilise financial markets | Sakshi
Sakshi News home page

ఒత్తిడికి మూలం డబ్బేనా..!?

Jan 26 2026 1:46 PM | Updated on Jan 26 2026 5:01 PM

​health tips: Traders hormones may destabilise financial markets

ఇన్నాళ్లు పని ఒత్తిడి, ఎగ్జామ్‌ భయం, కె​రీర్‌ భయం వాటివల్ల ఒత్తిడికిలోనై అనారోగ్యం పాలవ్వుతున్నాం అనుకున్నాం. కానీ మంచి ఉన్నత పొజిషన్లలలో ఉన్నవాళ్లు సైతం ఒత్తిడి లేదా ఆందోళనల బాధితులే. ఎందుకంటే మనందరం 'సమయం' అంటే 'డబ్బు' అనే భావనతో కూడిన విధానంలో బతుకుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం.  సింపుల్‌గా చెప్పాలంటే..యావత్తు ప్రపంచం కూడా స్టాక్‌ మార్కెట్‌ వార్తలతోనే మేల్కొంటోంది. అస్థిర మార్కెట్లు, త్రైమాసిక లక్ష్యాలు, క్లయింట్‌ అంచనాలు..తదితర ఒత్తిళ్లను ఆహ్వానించే వాళ్లం అని చొప్పొచ్చు. ఆ ఆలోచన తీరు మనల్ని ఏ స్థాయిలో ఒత్తిడి అనే గందరగోళంలో కొట్టుకుపోయేలా ..ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందో తెలిస్తే విస్తుపోతారు. 

అంతేగాదు ఈ ఒత్తిడి ఎంత భయంకరమైనదో..రోజువారి జీవిత పోరాటంలో అది మనల్ని ఎంతలా చిత్తుచేసి..అనారోగ్యం పాలు చేస్తుందో కళ్లకుకట్టినట్లుగా వివరించారు ఆరోగ్య నిపుణులు. దాన్ని అధిగమించేలే మన ధోరణి మారకపోతే అంతేసంగతులు అని గట్టిగా హెచ్చరిస్తున్నారు కూడా. 

సాధారణ వ్యక్తులు కంటే ఆర్థిక రంగంలో ఉన్న నిపుణులే ఒత్తిడి బాధితులుగా మారుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ఫైనాన్స్, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వంటి ఫైనాన్స్‌ నిపుణులకు రోజు టెన్షన్‌తో ప్రారంభం..ముగింపు ఉంటుందట. ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో దీర్ఘకాలికి ఒత్తిడి శరీరంలోని కార్డిసాల్‌ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇది బ్రెయిన్‌ నుంచి, జీవక్రియ, సంతానోత్పత్తి తదితర అన్నిటిని ప్రభావితం చేసి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. 

ఈ కార్డిసాల్‌ స్థాయిల్లోని హెచ్చు తగ్గులు..మహిళలు, పురుషల్లోని, ఈస్ట్రోజెన్-టెస్టోస్టెరాన్ సమతుల్యతకు అంతరాయం ఏర్పరుస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్సులిన్‌, ధైరాయిడ్‌ హార్మోన్లపై దుష్ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. దాంతో మహిళలు, పురుషులు పునరుత్పత్తి సమస్యలు, అధిక బరువు, నిద్రలేమి, చెడు కొలెస్ట్రాల్‌, త్వరితగతిన అలసిపోవడం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పదని చెబుతున్నారు. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని అన్నారు. ఒక్కోసారి అతిగా తినడం లేదా ఆకలిని కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. 

ఏవిధంగా చిత్తు చేస్తోందంటే..
సాధారణంగా ఈ అధిక ఒత్తిడి నిద్రలేమికి దారితీస్తుంది. ఈ నిద్రలేమి అనేది సంతానోత్పత్తి సమస్యలను తీవ్రతరం చేసే కీలక అంశం. ఈ నిద్రలేమి మెలటోనిన్‌ సాధారణ ఉత్పత్తిని దెబ్బతీసి పునరుత్పత్తికి సంబంధించిన హర్మోన్లను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి తగిని నిద్ర బాడీకి మంచి రీచార్జ్‌లా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడకూడదంటే..ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచిస్తునన్నారు నిపుణులు. 

ముఖ్యంగా డిజిటల్‌ డిటాక్స్‌, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు, సూర్యకాంతికి బహిర్గతం అవ్వడం, ప్రతి 20 నిమిషాలకు కదలికలు, మంచి నిద్ర తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు కార్టిసాల్‌ స్థాయిలు ఆటోమేటిగ్గా తగ్గి హర్మోన్ల బ్యాలెన్స్‌కు మద్దతిస్తుంది, ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. నిజానికి ఆర్థిక ప్రపంచం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం..నిరంతర వృద్ధి..పతనం అనేవి ఒక చక్రంలా సాగుతుంటుంది. 

కానీ ఆరోగ్య విషయంలో అలా కాదు. ఒక్కసారి పాడైతే బాగుచేసుకోవడం అంత సులభం కాదు..ఆ నష్టాన్ని అంత వేగంగా పూడ్చుకోలేమనేది గుర్తెరగాలి అని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అందువల్ల ఆరోగ్యమే అసలైన సంపద అనేది అస్సలు మరువ్వద్దు అని హితవు పలుకుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

 

(చదవండి: మోదీ మెచ్చిన 'కిచెన్‌'..! అక్కడ అంతా ఒకేసారి..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement