ముద్దు చేస్తే మొదటికే మోసం | Zoonoses Day | Sakshi
Sakshi News home page

ముద్దు చేస్తే మొదటికే మోసం

Jul 6 2026 8:24 AM | Updated on Jul 6 2026 8:58 AM

Zoonoses Day

రోజురోజుకూ పెంపుడు జంతువులు పెంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కుక్కలు, పిల్లులను, కుందేళ్లను, చిలుకలును పెంచుకోవడానికి ఇష్టపడతున్నారు. వాటితో ఆడుకోవడం, ఫొ టోలు దిగడం. సరదాగా బయటకు తీసుకెళ్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని ము ద్దాడుతూ సంబరపడిపోతుంటారు. అయితే పెట్స్‌ పెంచుకునే వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. వాటిన వల్ల మనకు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జూలై 6వ తేదీని ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్‌ డే సందర్భంగా జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంచిర్యాల జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి యాకుబ్‌రెడ్డి తెలిపారు. 

జూనోసిస్‌ వ్యాధులు అంటే..
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్‌ వ్యాధులు అంటారు. పశువులు, కుక్కలు, పిల్లులు, పక్షులు, కోళ్లు వంటి జంతువుల నుంచి మనుషులకు సుమారు 200 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. పశువుల పాకల     అపరిశుభ్రత, సరైన జాగ్రత్తలు లేకపోవడం వంటి కారణాలతో ఈ వ్యాధులు వ్యా ప్తి చెందుతాయి. ఈ రోజు పశుపోషకులు, పెంపుడు జంతువుల ప్రేమికులు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కల్పించాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు సూ చిస్తున్నారు. 

అప్రమత్తం కోసం జూనోసిస్‌ డే
1885వ సంవత్సరం జూలై 6వ తేదీన ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త లూయిస్‌ పాశ్చర్‌ చరిత్రాత్మకమైన ప్రయోగం చేశారు. పిచ్చి కుక్క కరిచిన ఒక బాలుడికి ఆయన మొదటిసారిగా రేబిస్‌ వ్యాధి నివారణ టీకా ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో జూలై 6న ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవంగా పాటించడం ప్రారంభమైంది. ఈ రోజు జంతువుల నుంచి వచ్చే వ్యాధుల నివారణపై విస్తృత అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడం, టీకాల ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ రోజు ప్రత్యేకత. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పెంపుడు కుక్కలను శాస్త్రీయ పద్ధతిలో, పశువైద్యుని సలహా మేరకు పెంచకపోతే వాటి నుండి వచ్చే వ్యాధులు ప్రాణాంతకంగా మారవచ్చు. శుచి, శుభ్రత పాటించడం అత్యంత ముఖ్యం. పెంపుడు కుక్కలకు సకాలంలో టీకాలు వేయించడం వల్ల యజమానులు, కుటుంబ సభ్యులు, పొరుగువారు అందరూ సురక్షితంగా ఉంటారు. కుక్కలతో సన్నిహితంగా ఉండేవారు కూడా రేబిస్‌ టీకా వేయించుకోవాలి. జూనోసిస్‌ వ్యాధుల నుండి రక్షణకు జాగ్రత్తలుపశువుల పాకలు, ఇళ్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. అనుమానాస్పద జంతువులను తాకకూడదు. గాయాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. పాలు, మాంసం బాగా ఉడికించి తినాలి. పశువైద్యుని సలహా తీసుకుని జంతువులను పెంచాలి.

వీరికి జూనోసిస్‌ వ్యాధులు..
కొన్ని వృత్తులు, జీవన విధానాలు జూనోసిస్‌ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. పశువుల కాపరులు, పశువైద్యులు, పెంపుడు కుక్కలు, పక్షులు పెంచేవారు, పౌల్ట్రీ ఫారాలు, డెయిరీ కార్మికులు, మాంసాహారులకు జూనోసిస్‌ వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

రేబిస్‌ ప్రాణాంతకం..
అత్యంత ప్రమాదకరమైన జూనోసిసూ్జనోసిస్‌ వ్యాధుల్లో రేబిస్‌ ప్రాణాంతకమైనది. ఇది రా బ్డోవైరస్‌ అనే వైరస్‌ వల్ల వస్తుంది. పిచ్చి కుక్క కాటు, లాలాజలం గాయానికి అంటడం ద్వా రా ఈవ్యాధి సోకుతుంది. కుక్కలు, పిల్లులు, నక్కలు, ముంగీసలు,తోడేళ్లువంటిజంతువుల ద్వారా మనుషులు, పశువులకు సోకుతుంది. 

లక్షణాలు..
కుక్క కరిచిన 2–3 వారాల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. ముఖం, మెడ ప్రాంతంలో కాటు వేస్తే వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. చివరికి నాడీ వ్యవస్థ ప్రభావితమై పక్షవాతం, మరణం సంభవిస్తుంది. ఒకసారి లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స దాదాపు అసాధ్యం. రేబిస్‌ వ్యాధి నివారణకు ఏఆర్‌వీ (ఆంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌) టీకా అత్యంత ప్రభావవంతం. మొదటి డోసు 30వ రోజు, బూస్టర్‌ డోసు 90వ రోజు, తర్వాత ఏడాదికి ఒకసారి ఇవ్వాలి. జూనోసిస్‌ దినోత్సవం కేవలం ఒక రోజు పాటించే వేడుక కాదు. ఇది జంతువులు, మనుషుల మధ్య ఆరోగ్య సంబంధాన్ని బలోపేతం చేసే అవగాహనా కార్యక్రమం. సరైన జాగ్రత్తలు, సకాలంలో టీకాలు వేయించడం ద్వారా మనం ఈ వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement