చాలా కాస్ట్లీ గురూ!పావు కిలో ఉప్పు రూ.7500?! | world’s most expensive salt 250 grams costs Rs 7500 | Sakshi
Sakshi News home page

చాలా కాస్ట్లీ గురూ!పావు కిలో ఉప్పు రూ.7500?!

Jan 27 2025 12:27 PM | Updated on Jan 27 2025 3:27 PM

world’s most expensive salt 250 grams costs Rs 7500

ఉప్పులేని కూరలను, వంటలను అస్సలు ఊహించలేంకదా. అందుకే అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు. 

అలాగే  ఇండియాలో కాస్త చవగ్గా దొరికే  పదార్థం కూడా ఉప్పే.   ఉప్పు ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఉప్పు ఎంత కీలక   పాత్ర పోషించిందో మన అందరికీ తెలుసు. అయితే ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్యమనే మనే వార్త ఒకటి ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు. ఒక గ్రాము ధర కొనాలంటేనే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.  ఏంటా ఉప్పు? తెలుసు కుందామా!

పింక్‌ సాల్ట్‌....రాక్‌ సాల్ట్‌,  బ్లాక్‌ సాల్ట్‌ ఇలా ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో దాని బట్టి ఒక్కో రేటు ఉంటుంది. వీటన్నింటిలో నేను రాజు అంటోందిక  కొరియన్‌ ఉప్పు. ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా  పేరుగాంచింది. 250 గ్రాముల  కొరియన్‌ ఉప్పు ధర రూ.7,500 ( 100 డాలర్లు) దీన్ని ప్రత్యేక పద్ధతుల్లో కొరియన్ వెదురుతో తయారు చేస్తారట. అందుకే దీన్ని కొరియన్ బాంబూ ఉప్పు, ఊదారంగు వెదురు ఉప్పు, జుగ్యోమ్ అని కూడా అంటారు.

కొరియన్ వెదురు ఉప్పు ఎలా తయారవుతుంది?
పురాతన కాలం నుంచి  కొన్ని శతాబ్దాల తరబడి కొరియన్ ఉప్పును వినియోగిస్తున్నారట. ఒక ప్రత్యకమైన పద్ధతుల్లో దీన్ని తయారు చేస్తారు. దీనికి పట్టే సమయం కూడా చాలా ఎక్కువే. వెదురు  బొంగులలలో సాధారణ సముద్రపు ఉప్పు వేసి, వాటిని బంకమట్టితో మూసివేసిన తర్వాత, అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. 800°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉప్పును తొమ్మిది సార్లు కాల్చి, చివరిగా 1,000°C  వద్ద రోస్టింగ్‌  చేస్తారు.  ఇందుకు దాదాపుగా 50 రోజులు పడుతుంది. ఉప్పును వేయించిన ప్రతిసారీ, వెదురు లక్షణాలు పూర్తిగా ఉప్పులోకి శోషించబడేలా చల్లబరుస్తారు.

అధిక ఉష్ణోగ్రతల వద్ద చాలా సార్లు వేడి చేయడంతోపాటు, దీని తయారీకి ప్రత్యేక ఫర్నేసులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం. ఎందుకంటే దీనికి చాలా శ్రద్ధ ,అనుభవం కావాలి. అందుకే ఈ ఉప్పు ధర అంత కాస్ట్లీ. సాధారణ సముద్రపు ఉప్పుతో పోలిస్తే వెదురు  ఉప్పుతో ప్రయోజనాలు చాలా మెండు.

వెదురు ఉప్పు-ఆరోగ్య ప్రయోజనాలు

  • వెదురు ఉప్పులో పొటాషియం, కాల్షియం  మెగ్నీషియంతో సహా 70కి పైగా అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 

  • యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: మంటను తగ్గిస్తుంది, కీళ్లనొప్పులు, గొంతు నొప్పి కి ఉపశమనంగా పనిచేస్తుంది.

  • నోటి పూత,  వాపు చిగుళ్ళకు చికిత్సలో పనిచేస్తుంది. నోటి పరిశుభ్రతకు చాలామంచిది.

  • శరీరంలో pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.

  • యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది.డయాబెటిస్,  హైపర్‌టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో పనిచేస్తుంది. 

  • ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల  కారణంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

  • టాక్సిన్ న్యూట్రలైజర్‌గా పనిచేసి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

  • చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర. ఇన్ఫెక్షన్‌లను నివారిస్తుంది. 

  • అంతేకాదు ఒత్తిడిని దూరం చేస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. గట్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.

 ప్రపంచంలో ఉప్పు ధర

ఉత్పత్తి పద్ధతులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ వంటి కారణాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా ఉప్పు ధరలు మారుతూ ఉంటాయి. 

ఖరీదైన ఉప్పు ఉత్పత్తి చేసే దేశాలు:

ఘనా

స్విట్జర్లాండ్

బెల్జియం

సరసమైన ఉప్పు ఉత్పత్తి చేసే దేశాలు

భారతదేశం

పాకిస్తాన్

కజకిస్తాన్

ఈజిప్ట్

భారతదేశం లాంటి దేశాలలో, దాని పొడవైన, విస్తృత తీరప్రాంతం , ప్రభుత్వ రాయితీల కారణంగా ఉప్పు  చవగ్గా లభిస్తుంది. అదేవిధంగా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉప్పు గనులు, తీరప్రాంతం ఉన్న కారణంగా ఇక్కడ ఉప్పు ఉత్పత్తి  ఎక్కువ.

అమెరికాలో ఉప్పు అత్యంత ఖరీదైనది, కిలోకు సుమారు రూ. 300. ఐస్లాండిక్ ఉప్పు మరొక ఖరీదైన రకం. దీన్ని  "లగ్జరీ సాల్ట్" అని పిలుస్తారు. ఇది ఐస్‌లాండ్‌లోని వాయువ్య ప్రాంతాలలో చేతితో తయారు చేస్తారు.
 

చదవండి: పంచ్‌లో బెబ్బులి..కిక్‌ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?
చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement