నేర్చుకున్నది ఏది వృధా కాదు. ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకు ఉదాహరణ ఈ మహిళే. ఎంత గౌరవనీయమైన ఫ్టైట్ అటెండెంట్ ఉద్యోగం చేసినా..ఆమె చివరికి ఎలాంటి వృత్తిని ఎంచుకుందో తెలిస్తే మతిపోతుంది. పైగా ఆ వ్యాపారంతో ఆమె రోజుకే లక్షల్లో డబ్బు గడిస్తుండటం విశేషం. ఇంతకీ ఆమె ఎలాంటి వ్యాపారం ఎంచుకుందంటే..
చైనాకు చెందిన జియావో చెన్ 12 ఏళ్లకు పైగా ఫ్లైట్ అటెండెంట్‌గా సేవలందించింది. కొత్త వ్యక్తులను కలుస్తూ..కొంగొత్త ప్రదేశాలను అన్వేషించే వృత్తిని కాదని పీతలు అమ్ముకుంటూ బతకాలని నిర్ణయించుకుంది. వామ్మో..! ఇదేం నిర్ణయం అని ఆశ్యర్యపోకండి. ఎందుకంటే చెన్ తన తల్లి పీతల వ్యాపారం బాగానే నడుస్తున్నా పెరుగతున్న పనిభారం రీత్యా ఎక్కువ మంది సిబ్బంది అవసరం ఏర్పడినట్లు పేర్కొంది. ఆ నేపథ్యంలోనే తన ఉద్యోగానికి రిజైన్ చేసి..నాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న తీరప్రాంత నగరమైన నింగ్బోకు తిరిగి వచ్చి తల్లికి వ్యాపారాన్ని నడపడంలో సహాయం చేయాలని నిర్ణయించుకుంది.
ఈ రెండు ఉద్యోగాలు భిన్నమైనప్పటికీ..విమానయాన రంగంలో తాను పెంపొందించుకున్న నైపుణ్యాలను తన కొత్త పాత్రలో ఉపయోగించుకోవడానికి చెన్ ఒక మార్గాన్ని కనుగొంది. అదేంటంటే..తన పీతల వ్యాపార ప్రచారానికి ఉయోగపడేల సోషల్‌మీడియా ఫ్లాట్ ఫామ్‌లను ఉపయోగించుకుంది. ఆ వీడియోల్లో సముద్రపు ఆహారాన్ని ఎలా రవాణా చేస్తారు..ఆ క్రమంలో ఉండే శ్రమ, కష్టాలు కళ్లకు కట్టినట్లు చూపించింది. అలాగే చెరువుల దగ్గర ఎలా పీతలు పట్టుకుంటారు, వాటి ప్యాకింగ్ ప్రక్రియలు అన్ని చూపిస్తూ..కొనుగోలుదారులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంది.
అలా తన ఆన్‌లైన్ కంటెంట్‌ని ఉపయోగించి తన ఉత్పత్తును ప్రదర్శిస్తూ తన వ్యాపారాన్ని సుదుర ప్రాంతాల ప్రజలకు చేరువయ్యేలా చేసింది. దాంతో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగి..పీతలకు మంచి గిరాకీ ఏర్పడింది. దాంతో ఆర్డర్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి.. సిబ్బందికి పని భారం పెరిగింది. ఎంతలా అంటే పండుగ కాలంలోనే ఈ వ్యాపారం రోజువారీగా ఏకంగా రూ. 14 లక్షలు పైనే అమ్మకాలు రావడం మొదలైంది. అయితే ఇప్పుడు అమ్మకాలు పెరిగినా..ఆ డిమాండ్‌కి తగ్గట్టు నాణ్యమైన పచ్చి పీతలను సంపాదించడంలో ఇబ్బందులు పడుతున్నారు.
దాంతో ఆర్డర్లను పరిమిత చేయక తప్పడం లేదు చెన్‌కి. ప్రతి ఆర్డర్‌ను అంగీకరించి, నాణ్యత తగ్గే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి బదులుగా, అమ్మకాలను పరిమితం చేయడం మేలని నిర్ణయించుకుంది చెన్. అత్యంత వైరుధ్యమైన వృత్తిని కూడా ఇష్టంతో స్వీకరిస్తే లాభాల బాట పట్టించొచ్చని చెబుతోంది చెన్ స్టోరీ.
ఇదీ చదవండి: హాబీతో కేన్సర్‌ని జయించింది..! వైద్యానికే అందని మిరాకిల్..


