తరుచూ బీట్‌ రూట్, క్యారెట్, బంగాళ దుంప, ద్రాక్ష పండ్లు తింటున్నారా.. అయితే

What foods Are Good For Healthy Liver In telugu - Sakshi

కాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా కాలేయం త్వరగా దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. దీనివల్ల లివర్‌ ఆరోగ్యం బాగుంటుంది.

పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు జంక్‌ ఫుడ్స్‌ ఎక్కువ తినడం ఇటీవల కాలంలో బాగా అలవాటైంది. జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాకుండా ఊబకాయం కూడా వస్తుంది. దీనివల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది లివర్‌ సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. లివర్‌ సిర్రోసిస్‌ కారణంగా, కాలేయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వాటి వినియోగానికి దూరంగా ఉండాలి. 

లివర్‌ను కాపాడే పదార్థాల విషయానికి వస్తే.. ఓ స్ట్రాంగ్‌ కాఫీ తాగితే చాలు... ఎంతో రిలాక్స్‌ అవుతాం. కొన్ని రోజులుగా కాఫీపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు కాఫీని తాగడం వల్ల లివర్‌ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తేల్చారు. కాఫీలోని ప్రత్యేక గుణాలు లివర్‌ క్యాన్సర్‌ రాకుండా చూస్తాయని తేలింది. కాబట్టి మోతాదు మించని కాఫీ, టీల వల్ల లివర్‌ ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కాఫీ, టీ అలవాటు లేకపోతే, కొత్తగా అలవాటు చేసుకోనవసరం లేదు. ఉదయమే గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వల్ల కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. 
చదవండి: చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే..

ద్రాక్షలో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కాలేయాన్ని కాపాడతాయి. కాబట్టి తరచు ద్రాక్ష పండ్లు తినడం ఎంతో మంచిది. అలాగే వెల్లుల్లి. దీనిని వెల్‌ ఉల్లి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని హానికర విషాలు తొలగిపోతాయి. కాలేయం ఆరోగ్యం బాగుంటుంది. 

బీట్‌ రూట్, క్యారెట్, బంగాళ దుంపల్లో కాలేయ కణాల పునరుత్పత్తికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యం బాగుంటుంది. రోజూ వీటిని  డైట్‌లో చేర్చుకుంటే కాలేయ పనితీరు మెరుగవుతుంది. ఆపిల్స్‌ కూడా కాలేయాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. యాపిల్‌ తొక్క, లోపలి గుజ్జులోనూ పెక్టిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇంకా యాపిల్‌లో ఉండే మ్యాలిక్‌ యాసిడ్‌ అనేది పేగులు, కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తినొచ్చు.

శరీరానికి కావాల్సిన ఎన్నో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. రోజూ ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోతాయి. క్యాబేజీ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మీ డైట్‌లో భాగం చేసుకోవడం మరచిపోవద్దు.
చదవండి: వాష్‌రూమ్‌ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు?

గుడ్‌ ఫ్యాట్స్, ఎన్నో పోషకాలు ఉండే నట్స్‌ కూడా లివర్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్‌ ఇ లివర్‌ని కాపాడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉండే చేపలు కూడా లివర్‌ని కాపాడతాయి. వీటిని తినడం వల్ల గుండెకి మేలు జరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆలివ్‌ ఆయిల్‌లో ఎన్నో ఆరోగ్య గుణాలు  దాగి ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా లివర్‌ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పరిశోధనలలో తేలింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top