నయా ట్రెండ్‌ ‘వేగన్‌ ఫుడ్‌’..! | Vegan Food: A Delight For Vegans In Hyderabad | Sakshi
Sakshi News home page

వినూత్న రుచులకు కేరాఫ్‌గా వేగన్‌ రెస్టారెంట్లు  

Sep 6 2021 2:16 PM | Updated on Sep 6 2021 2:18 PM

Vegan Food: A Delight For Vegans In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నవాబుల కాలం నుంచి పేరుగాంచిన బిర్యానీ మొదలు విశ్వవ్యాప్త ప్రాచుర్యం కలిగిన కాంటినెంటల్‌ ఫుడ్‌ వెరైటీల వరకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంది మన భాగ్యనగరం. వినూత్న రుచులను ఆహ్వానించడంలో హైదరాబాద్‌ ఎప్పుడూ ముందుంటుంది. అయితే సిటీలో ఈ మధ్య విరివిగా వినిపిస్తున్న పదం ‘వేగన్‌ ఫుడ్‌’.. ఈ ఫుడ్‌ కోసమే ప్రత్యేకంగా పదుల సంఖ్యలో వేగన్‌ రెస్టారెంట్లు కూడా వెలిశాయి.    

వేగన్‌ ఫ్రెండ్లీ సిటీగా హైదరాబాద్‌.. 
‘వేగనిజమ్‌’లో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ వేగన్‌ ఫుడ్‌. జంతువుల మాంసమే కాకుండా పాలు, గుడ్లు, నెయ్యిలాంటి ఇతర జంతు సంబంధిత పదార్థాలను తినని వారిని, జంతు సంబంధిత పదార్థాలతో తయారు చేసిన వస్తువులను వాడని వారిని వేగన్స్‌గా పరిగణిస్తారు. జీవ హింసకు వ్యతిరేకంగా, మూగజీవాల స్వేచ్ఛా వాతావరణానికి హానితలపెట్టకుండా వాటి జీవన భద్రతకు వేగన్స్‌ కృషి చేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్‌ నగరంలో కూడా వేగనిజంపై ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరిగింది.
చదవండి: కోన్‌ పిజ్జా ఎప్పుడైనా చూశారా..! ఇప్పుడిదే వైరల్‌!!

గత దశాబ్దకాలంగా జంతు ప్రేమికుల ఆధ్వర్యంలో వేగన్‌ క్లబ్‌లు, వేగన్‌ గ్రూప్స్‌ ఏర్పడుతున్నాయి. ఇందులో భాగంగా వేగన్‌ ఫుడ్‌ తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వేగన్‌ ఫుడ్‌ ప్రాచుర్యం పొందడమే కాకుండా ఎన్నో వేగన్‌ ఫుడ్‌ కోర్ట్‌లను ప్రారంభిస్తున్నారు. 2015లో హైదరాబాద్‌లో మొట్టమొదటి వేగన్‌ కేఫ్‌ ఏర్పాటు కాగా, ప్రస్తుతం అలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. అంతేకాకుండా 2019లోనే ‘పెటా’ఆధ్వర్యంలో ‘మోస్ట్‌ వేగన్‌ ఫ్రెండ్లీ సిటీ’గా నగరాన్ని ఎంపిక చేయడం విశేషం.  

విభిన్న రుచుల సమ్మేళనం.. 
వేగన్స్‌ కోసం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైనిక్‌పురి తదితర ప్రాంతాల్లో ఫుడ్‌ రెస్టారెంట్‌లు, బేకరీలు, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ల వంటి ఫుడ్‌ స్పాట్స్‌ ఉన్నాయి. జంతు సంబంధ పదార్థాలు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు తదితర మొక్కల పదార్థాలతో ఈ ఫుడ్‌ని తయారు చేస్తారు. ఇందులో భాగంగా సాండ్‌వెజ్‌లు, సలాడ్స్, డిసెర్ట్స్, కేక్‌లు, చాక్‌లెట్‌లు తయారు చేస్తున్నారు.  
చదవండి: చిల్లీ మష్రూమ్స్‌ ఎలా తయారు చేయాలో తెలుసా?

ఆరోగ్య ప్రధాయిని.. 
జంతు హింసపైన అవగాహన పెంచడమే కాకుండా వేగన్‌ల ఆహార సౌలభ్యం కోసం వినూత్నంగా వేగన్‌ ఫుడ్‌ కేఫ్‌ను ఏర్పాటు చేశాం. వేగన్స్‌ని సంతృప్తి పరచడానికి పిజ్జాలు, డిసర్ట్స్‌తో పాటు పలురకాల ఫుడ్‌ను తయారు చేస్తున్నాం. అంతే కాకుండా వేగన్‌ ఫుడ్‌ స్టోర్‌ ప్రారంభించాం. జీవన సమతుల్యం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని అందించడంలో వేగన్‌ ఫుడ్‌ విశిష్టతను కలిగి ఉంటుంది. వేగన్స్‌ మాత్రమే కాదు నాన్‌ వేగన్స్‌ కూడా కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు.  
- వేద్‌ మోహన్,  ఈ–వేగన్‌ ఫుడ్‌ స్టోర్, కేఫ్, సైనిక్‌పురి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement