గర్భవతులకు ఇదో పెద్ద సమస్య!   

  Urinary Infection During Pregnancy - Sakshi

గర్భవతుల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే గర్భసంచి పెరుగుతున్నకొద్దీ అది మూత్రనాళాలపై ఒత్తిడి కలగజేయడం వల్ల మూత్రపిండాలు వాచిపోతాయి. దాంతో మూత్రాశయంలో ఉండే ఇన్ఫెక్షన్‌ కాస్తా... మూత్రపిండాలకూ చేరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూత్రంలో ఇన్ఫెక్షన్‌ రావడం వల్ల అబార్షన్‌ అయ్యే ప్రమాదమూ ఉంది లేదా నెలల నిండకముందే ప్రసవం కూడా కావచ్చు. అందువల్ల గర్భవతులు మూత్రపరీక్ష చేయించుకుని, ఇన్ఫెక్షన్‌ ఉంటే తప్పక మందులు వాడాల్సి ఉంటుంది.

 ఇన్ఫెక్షన్‌కు చికిత్స  

సాధారణంగా వచ్చే సిస్టైటిస్‌కి మూడు రోజుల పాటు యాంటీబయాటిక్స్‌ కోర్సు సరిపోతుంది. మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్‌ వచ్చినట్లయితే పది నుంచి పదిహేను రోజుల వరకు యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. కొందరిలో తరచూ ఇన్ఫెక్షన్స్‌ వస్తున్నట్లయితే దీర్ఘకాలం పాటు చికిత్స (లాంగ్‌ టర్మ్‌ సప్రెసెంట్‌ థెరపీ) అవసరమవుతుంది. ఇందులో చాలా తక్కువ మోతాదులో దీర్ఘకాలం పాటు యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. ఇక మూత్రపిండాలలో రాళ్లను తొలగించడం కోసం కొన్ని నాన్‌సర్జికల్, సర్జికల్‌ ప్రొíసీజర్స్‌ అవసరం కావచ్చు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top