Menthi Podi: షుగర్‌ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే..

Top 7 Health Benefits Consuming Mixing Milk Fenugreek Seeds Powder - Sakshi

పాలు, మెంతిపొడి కలిపి తీసుకుంటే...

Menthi Podi- Milk- Health Tips In Telugu: మెంతుల్ని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అదే రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి లేదా చిటికడు మెంతి పొడిని పాలలో కలిపి తాగితే సుఖమైన నిద్ర పడుతుంది. 

మెంతి పొడి పాలల్లో కలిపి తాగడం వల్ల కలిగే అదనపు లాభాలు
►శరీరం అంతర్గతంగా పటిష్టమౌతుంది.
►వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 
►శరీరంలో ఇమ్యూనిటీని పెంచేందుకు పాలు, మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి.
►అంతేకాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తుంది.
►అందుకే చలికాలంలో మెంతిపొడిని పాలలో కలిపి తాగడం వల్ల చాలా లాభాలున్నాయి.

డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు
►గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మెంతులు కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను గణనీయంగా తగ్గిస్తాయి.
►బ్లడ్‌ ప్రెషర్‌ నియంత్రిస్తాయి.

►మెంతిపొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. 
►పాలలో తీసుకోలేనివారు రాత్రిపూట గ్లాసు నీళ్లలో అరచెంచా లేదా చెంచా మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ మెంతులను నమిలి, నీటిని తాగినా మంచిదే.

►అయితే వేడిపాలలో చిటికడు మెంతుల పొడి కలుపుకుని తాగడం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయని అనుభవజ్ఞుల సూచన.    
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు తగిన పరిష్కారం పొందవచ్చు.

చదవండి: Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్‌ వుమెన్‌లో ఈ సమస్యలు..
Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్‌.. ఇంకా మెదడు..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top