వేదామృతం.. గీతామృతం.. ఏదైనా నీరా ప్రియం!

Telangana Muchatlu By Nri-Vemula Prabhakar-About-Neera - Sakshi

దేవునికి సమర్పించేది నైవేద్యం, కాని దాన్ని తినేది మాత్రం మనిషే. మనుషుల ఆహార అలవాట్లే దేవునికి ఆపాదించబడ్డాయన్నది వాస్తవం. ఆచారాల్లో నిమగ్నం చేయడం వల్ల మనుషులను మంచి కర్మల వైపు మల్లించవచ్చునన్న భావనతో వేదకాలంలో వచ్చిన యజ్ఞయాగాదులు,పశుబలి,సూరాపానం పూర్వ మీమాంస ( prior study ) పద్దతి. దీని కర్త వేద వ్యాసుని శిష్యుడైన జైమిని అంటారు.

ఆనాటి సమాజంపైనున్నబౌద్ధమత ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్వ మీమాంస కూడదని హైందవ పూజా విధానాన్ని 'ఉత్తరమీమాంస' ( posterior study) వైపు అనగా శాఖాహర క్రతువు వైపు, గోవధ నుండి గోసంరక్షణ వైపు మల్లించినవాడు  శంకరాచార్యుడు.

ఈ దెబ్బతో దైవపూజ యజ్ఞయాగాల్లో జరిగే పశుబలితో పాటు సూరాపానం /కల్లు వంటి మద్యపానాలను కూడా పక్కకు పెట్టినట్లయింది.అయితే గ్రామ దేవతల ఆరాధనలో కల్లు వినియోగం 'కల్లుసాక'గా ఇప్పటికీ విరివిగా జరుగుతున్నదే.

ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత చెట్ల నుండి తీయబడుతున్న ప్రకృతి సహజమైన పానీయం 'నీరా' వాడకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో ప్రారంభించిన ఔట్లెట్లో దాని పేరు 'వేదామృతం 'గా పెట్టడం వివాదాస్పదం అయింది. 

 నీర ఎంత మధురమైనదైనా అది మద్య సంబంధమైందే, దానికి 'వేద' పదాన్ని జోడించడం అపచారం అంటూ వాదిస్తున్నారు కొన్ని బ్రాహ్మణ సంఘాలవారు.

► అమృతం రుచి ఎలా ఉంటుందో దేవతలకే తెలుసు, మనుషులకు తెలిసింది మహా రుచికరమైంది, పైగా బోలెడన్ని ఔషద గుణాలున్నది నీరా కావాలంటే కాస్త తాగి చూడండి అంటున్నారు గౌడ సంఘాలవారు.

ఈ గొడవలన్నీ దేనికి నీరా చెట్లు గీయడం ద్వారానే కదా లభిస్తున్నది  దానికి 'గీతామృతం 'అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది కదా!అని నాబోటి వారు సలహా ఇస్తే అందులో కూడా మతాన్ని చూసే మహానుభావులున్నారు అంటూ వారు 'వేద' వాక్కునే వల్లిస్తున్నారు. అయ్యా! ఏ పెరైనా పెట్టుకొండి మాకు కావాల్సింది నీరా,మీరు స్వచ్ఛమైన నీరా అందిస్తే అదే మహాభాగ్యం!అంటున్నారు భాగ్యనగరవాసులు.

-వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top