
చేయి చేయి కలిపి చతుర్భుజమై.. కదలి వద్దాం కలను నిజం చేద్దాం.. అందరూ ఒక్కటై అడుగులేద్దాం.. అనుబంధం పెంచుదాం, ఆనందం పంచుదాం.. అన్న ఓ రచయిత మాటలను గుర్తు చేసేలా ఆ ప్రాంత మహిళా శక్తి మొత్తం ముందుకు కదిలింది.. కబ్జా దారుల కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ స్థలాన్ని విడిపించారు.. అనేక ఆటుపోట్లను అధిగమించి.. బెదిరింపులు, ఇబ్బందులకు ఓర్చి అనుకున్న లక్ష్యాన్ని చేరారు.. వారే మలక్‌పేటలోని శ్రీపురం కాలనీ మహిళ సంక్షేమ సంఘం వారు.. కాలనీ వాసులకు ప్రయోజనం చేకూర్చేందుకు ముందడుగేశారు.. చివరికి ‘స్వర్ణచతుర్భుజి’ పేరుతో పార్కును ఏర్పాటు చేశారు.
ఒకప్పుడు అంటే 2000 సంవత్సరానికి ముందు.. ఆ ప్రాంతమంతా దుర్గంధంతో అటువైపు వెళ్లలేని పరిస్థితి ఉండేది.. అలాంటి స్థలం కొందరు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది.. కాలనీ వాసుల ప్రయోజనార్థం స్థానిక మహిళా సంక్షేమ సంఘం నాయకులు చుట్టుపక్కల వారి సహకారంతో గుండవరం వేణుగోపాల్ రావు, పద్మలు కోర్టును ఆశ్రయించి పురాతన బావితో సహా స్థలాన్ని కాపాడి చక్కటి నందనవనంగా తీర్చిదిద్దారు..
అనేక బెదిరింపులు, ఇబ్బందులకు ఓర్చి చివరికి ‘స్వర్ణచతుర్భుజి’ పేరుతో పార్కుగా అభివృద్ధి చేశారు. పార్కు ఏర్పడి నేటికి సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తికావడంతో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజతోత్సవాలు జరుపుకున్నారు. పార్కు అవతరణకు సహకరించిన ఆతీ్మయులు రాజేవ్వరరావు, రాజేందర్, నరేందర్, ప్రవీణ్, స్వర్ణ, శకుంతల, అనిత, హేమ తదితరులను ఆహా్వనించి అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాలనీవాసులతో నాటి విశేషాలను పంచుకున్నారు.
ఆహ్లాదాన్ని పంచుతూ..
ప్రస్తుతం స్థానిక కాలనీవాసులకు పచ్చని వాతావరణంతో, చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతోంది. స్థానిక ప్రజల అవసరాలు తీర్చేలా రూపొదిద్దిన పార్కులో నడక మార్గం, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా వివిధ రకాల ఆట సామగ్రి ఇలా సకల వసతులూ ఏర్పాటు చేసుకున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, అలసట తగ్గించుకునేందుకు అనువుగా పచ్చటి వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
(చదవండి: గ్రీన్ గణేశాయ నమః..! పండుగ పచ్చగా..ప్రకృతి మెచ్చగా..)