Summer Drinks: రోజు గ్లాసు బీట్‌రూట్‌ – దానిమ్మ జ్యూస్‌ తాగారంటే..

Summer Drinks: Health Benifits With-Pomegranate-Beetroot Juice - Sakshi

కావలసినవి
బీట్‌రూట్‌ – మీడియం సైజువి రెండు, దానిమ్మ – రెండు, పుదీనా ఆకులు – పది, తేనె – రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం – అరచెక్క. 

తయారీ విధానం
►బీట్‌రూట్‌ను తొక్కతీసి ముక్కలుగా తరగాలి 
►దానిమ్మ గింజలను ఒలుచుకోవాలి 
►బ్లెండర్‌లో బీట్‌రూట్‌ ముక్కలు, దానిమ్మ గింజలు, పుదీనా ఆకులు వేసి గ్రైండ్‌ చేయాలి 
►గ్రైండ్‌ అయిన మిశ్రమాన్ని వడపోసి జ్యూస్‌ను  గ్లాసులో పోయాలి 
► దీనిలో తేనె, నిమ్మరసం కలిపి సర్వ్‌ చేసుకోవాలి. 

దానిమ్మ-బీట్‌రూట్‌ జ్యూస్‌ ఉపయోగాలు
►వేసవిలో దాహం తీర్చే డ్రింకేగాక, మంచి డీటాక్స్‌ డ్రింక్‌గా ఈ జ్యూస్‌ పనిచేస్తుంది. 
► బీట్‌రూట్‌ రోగనిరోధక వ్యస్థను మరింత దృఢంగా మారుస్తుంది. 
►దానిమ్మ గింజలు, బీట్‌ రూట్‌ను కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది 
►ఈ జ్యూస్‌లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి. 
►బీట్‌రూట్‌లో.. ఐరన్, క్యాల్షియం, జింక్, సోడియం, మెగ్నీషియం, విటమిన్‌ ఎ, బీ 6, సి, ఫోలేట్,, నియాసిన్‌లు..æ, దానిమ్మ గింజల్లోని.. విటమిన్‌ బి, సి, కె, పొటాషియం, పీచుపదార్థాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. 
►రోజుకొక గ్లాసు తాగడం వల్ల చర్మానికి, జుట్టుకు పోషణ అందుతుంది.    

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top