ఒత్తిడికి దూరంగా ఉండాలంటే..?

To stay away from stress - Sakshi

ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కారణం సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడమే. డైట్‌ నుంచి కొన్ని ఆహారాలని మినహాయించడం వల్ల డిప్రెషన్‌ నుంచి బయటపడవచ్చు.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం...

చక్కెర
మీరు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ముందుగా ఆహారం నుంచి చక్కెరను మినహాయించండి. ఎందుకంటే తీపి పదార్థాలు మీ శక్తి స్థాయిని ప్రభావితం చేస్తాయి. శరీర అసమతుల్యతను కలిగిస్తాయి. దీనివల్ల మనిషిలో టెన్షన్‌ పెరగడం మొదలవుతుంది. అందుకే డిప్రెషన్‌తో బాధపడేవారు చక్కెరను ఎక్కువగా తినకూడదు.

ఆల్కహాల్‌
ఆల్కహాల్‌ కాలేయానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఆల్కహాల్‌ మెదడులోని సెరోటోనిన్‌ చర్యను మారుస్తుంది. ఇది ఆందోళనను పెంచుతుంది. అందుకే మద్యం తాగకూడదు. ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల ∙ఆందోళన పెరుగుతుంది. 

కెఫిన్‌ 
కెఫిన్‌ కలిగిన పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి కారణమవుతాయి. కెఫిన్‌ అనేది కాఫీలోనే కాదు, టీలో కూడా ఉంటుంది. అందువల్ల కాఫీ, టీ, చాక్లెట్లు, కొన్ని రకాల శీతల పానీయాలలో కూడా కెఫిన్‌ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటివల్ల డిప్రెషన్‌కు గురవుతారు.

ఉప్పు
ఉప్పు మానసిక స్థితిని పాడు చేస్తుంది. మీరు అలసిపోయేలా చేస్తుంది. అలాగని ఉప్పు తీసుకోవడాన్ని పూర్తిగా మానేయకూడదు. తగ్గించి తీసుకుంటే ఉత్తమం. కొందరికి మజ్జిగన్నంలో ఉప్పు తప్పనిసరి. ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ అంటే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top