Srikrishna Janmashtami: కన్నయ్యకు ఇష్టమైన వెన్న, అటుకులతో ప్రొటిన్‌ లడ్డు, అవల్‌ పుట్టు! | Srikrishna Janmashtami 2022: Protein Laddu Aval Puttu Recipes In Telugu | Sakshi
Sakshi News home page

Protein Laddu- Aval Puttu: కన్నయ్యకు ఇష్టమైన వెన్న, అటుకులతో ప్రొటిన్‌ లడ్డు, అవల్‌ పుట్టు!

Aug 19 2022 9:53 AM | Updated on Aug 19 2022 10:06 AM

Srikrishna Janmashtami 2022: Protein Laddu Aval Puttu Recipes In Telugu - Sakshi

ప్రొటిన్‌ లడ్డు- అవల్‌ పుట్టు

Srikrishna Janmashtami 2022- Protein Laddu- Aval Puttu Recipes: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణునికి ప్రియమైన అటుకులు, నెయ్యితో విభిన్న రకాల నైవేద్యాలను సమర్పిద్దాం... రుచులను ఆస్వాదిద్దాం..

ప్రోటీన్‌ లడ్డు 
కావలసినవి:
►వెన్న – టేబుల్‌ స్పూను
►జీడిపప్పు పలుకులు – మూడు టేబుల్‌ స్పూన్లు
►కిస్‌మిస్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు
►పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు
►బెల్లం తరుగు – అరకప్పు
►అటుకులు – రెండు కప్పులు
►యాలకులు – ఆరు.

తయారీ:
►జీడిపప్పు, కిస్‌మిస్‌లను వెన్నలో వేయించాలి.
►ఇవి వేగిన తరువాత కొబ్బరి తురుము వేసి దోరగా వేయించాలి
►కొబ్బరి కూడా వేగాక బెల్లం వేయాలి
►మరో బాణలిలో అటుకులను దోరగా వేయించి, యాలకులు వేసి మిక్సీజార్‌ లో పొడిచేసి పెట్టుకోవాలి
►బెల్లం కరిగిన తరువాత అటుకుల పొడి వేసి చక్కగా కలుపుకుని లడ్డులా చుట్టుకుంటే ప్రోటీన్‌ లడ్డు రెడీ. 

అవల్‌ పుట్టు
కావలసినవి:
►అటుకులు – అరకప్పు
►బెల్లం – అరకప్పు
►పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు
►జీడిపప్పు పలుకులు – ఆరు
►యాలకుల పొడి – పావు టీస్పూను
►నెయ్యి – రెండు టీస్పూన్లు
►ఉప్పు – చిటికెడు.

తయారీ:
►అటుకులను మూడు నిమిషాలపాటు రంగు మారకుండా దోరగా వేయించుకుని, చల్లారాక మిక్సీ జార్‌లో వేసి రవ్వలా గ్రైండ్‌ చేయాలి
►రవ్వను వెడల్పాటి పాత్రలో పోసుకుని, చిటికెడు ఉప్పు వేసి కలపాలి.
►దీనిలో కొద్దికొద్దిగా వేడి నీళ్లు చల్లుతూ కలుపుకోవాలి.
►రవ్వ మరీ మెత్తగా కాకుండా గుప్పెట్లో పట్టుకుని వత్తితే ఉండయ్యేంత మెత్తగా కలిపి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

►టీస్పూను నెయ్యిలో జీడిపప్పుని బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి
►ఇప్పుడు మందపాటి పాత్రలో బెల్లం, పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి.

►బెల్లం కరిగిన వెంటనే ద్రావణాన్ని వడగట్టాలి ∙వడగట్టిన ద్రావణాన్ని ఉండపాకం రానివ్వాలి.
►పాకం రాగానే స్టవ్‌ ఆపేసి.. తడిపిపెట్టుకున్న అటుకుల రవ్వ వేసి తిప్పాలి
►రవ్వను చక్కగా కలుపుకున్న తరువాత జీడిపప్పు, కొబ్బరి తురుము, మిగిలిన నెయ్యి వేసి అందంగా గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.  

ఇవి కూడా ట్రే చేయండి: Bread Jamun Recipe: బ్రెడ్‌ జామూన్‌ ఇంట్లోనే తయారు చేసుకోండిలా!
దాల్‌ బనానా ఖీర్‌, కలాకండ్‌ లడ్డూ తయారీ ఇలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement