ఈ రోలర్‌తో నిగనిగలాడే కోమలమైన చర్మం మీ సొంతం!

Skin Glow Rose Quartz Face Massage Roller  - Sakshi

 ఈ ఫేస్‌ లిఫ్టింగ్‌ రోలర్‌. కళ్ల చుట్టూ ఉండే సున్నితమైన చర్మం, మృదువైన పెదవులతో పాటు బుగ్గలు, మెడ చుట్టూ.. నుదుటి పైన.. చేతులు, కాళ్లు, తొడలు, నడుము ఇలా ప్రతి పార్ట్‌లోనూ ఈ రోలర్‌ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ స్కిన్‌ టోన్‌ – లిఫ్ట్‌ జెర్మేనియం కాంటౌరింగ్‌ మసాజ్‌ రోలర్‌కి కిందవైపు జెర్మేనియం మసాజ్‌ హెడ్‌ అటాచ్‌ అయ్యి ఉంటుంది. పైభాగంలో అమర్చుకోవడానికి.. 2 చిన్నచిన్న స్టోన్‌ మసాజర్లు, ఒక చిన్న జెర్మేనియం మసాజ్‌ హెడ్‌ అదనంగా లభిస్తాయి. అవసరాన్ని బట్టి ఆ మూడింటిలో ఒకదాన్ని మార్చుకుంటూ, మసాజ్‌ చేసుకోవచ్చు.

ఇది ముఖవర్చస్సును పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే వయసుతో వచ్చే వృద్ధాప్య ఛాయలను మాయం చేస్తుంది. ముడతలను ఇట్టే పోగొడుతుంది. ఇందులోని రెండు  జెర్మేనియం మసాజ్‌ రోలర్స్‌ మీదున్న ఆక్యుప్రెషర్‌ ప్యాడ్స్‌.. శరీరకణజాలలను ఉత్తేజపరచేందుకు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తాయి. దాంతో చర్మం బిగుతుగా మారుతుంది. ఆరోగ్యంగా నిగనిగలాడే కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది.

దీనితో ఒక్కో భాగం వద్ద సుమారు 30 నుంచి 60 సెకన్స్‌ పాటు.. క్రమం తప్పకుండా మసాజ్‌ చేసుకోవచ్చు. సాధారణ మసాజ్‌ ప్రోసెస్‌ని ఫాలో అవుతూ.. కింద నుంచి పైకి మసాజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వినియోగించిన అనంతరం నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే సరిపోతుంది. ఈ టూల్‌ చాలా కలర్స్‌లో అందుబాటులో ఉంది. ధర 21 డాలర్లు (1,742 రూపాయలు) ఉంటుంది. 

(చదవండి: నటి మల్లికా అరోరా ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే..!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top