సౌకర్యంగా ఉంటేనే కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాం: శ్రద్దా కపూర్‌

Shradda Kapoor Says Tyani Brands Lehangas Will Fit For Fashion - Sakshi

సెట్స్‌ మీద స్క్రిప్ట్‌లోని పాత్రల పట్లే  కాదు ఆఫ్‌సెట్స్‌లో అటెండ్‌ అవబోతున్న అకేషన్స్‌కి ధరించబోయే అవుట్‌ ఫిట్స్‌ మీదా అంతే శ్రద్ధ పెడుతుంది శ్రద్ధా కపూర్‌! అందుకే హీరోయిన్‌గా ఆమెకు ఎంత క్రేజో... ఫ్యాషన్‌ దివాగానూ ఆమె పట్ల అంతే అభిమానం సినీప్రియులకు. ఆమెను దివానీగా మార్చిన బ్రాండ్స్‌ ఇవే.. సౌకర్యంగా ఉండే దుస్తులనే ఇష్టపడతా. సౌకర్యంగా ఉంటేనే కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాం. అందుకే నా దృష్టిలో ఫ్యాషన్‌ అంటే సౌకర్యం. ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం.
– శ్రద్ధా కపూర్‌ 

ఐవరీ లెహెంగా 
డిజైనర్‌: అనీతా డోంగ్రే
ధర:రూ. 1,99,000 

త్యానీ
బంగారు, వజ్రాభరణాలను భారతీయులు ఇష్టపడ్డంతగా ప్రపంచంలో ఇంకెవరూ ఇష్టపడరు. నగలు చేయించడమంటే ఒకరకంగా ఆస్తిని కూడబెట్టడమే మన దగ్గర. అదో ఆనవాయితీగానూ స్థిరపడింది. ఈ పాయింటే ‘త్యానీ’ బ్రాండ్‌ స్థాపనకు ప్రేరణనిచ్చింది. దీని వెనకున్న వ్యక్తి కరణ్‌ జోహార్‌. మీరు సరిగ్గానే చదివారు. బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్‌ జోహారే. తన సృజన తృష్ణకు మరో విండోనే ఈ ‘త్యానీ’. భారతీయ సంప్రదాయ నగలను ఆధునిక మహిళ అభిరుచికి తగ్గట్టుగా మలుస్తోందీ త్యానీ. అదే దాని మార్క్‌.. బ్రాండ్‌ వాల్యూనూ! 27 వేల రూపాయల నుంచి లక్షల్లో పలుకుతుంది త్యాగీ జ్యూయెలరీ.

అనీతా డోంగ్రే
బాల్యంలోని సెలవులను జైపూర్‌లోని అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో గడపడం వల్ల స్థానిక సంప్రదాయ కుట్లు, అల్లికలను చూస్తూ పెరిగింది అనీతా డోంగ్రే. దాంతో చిన్నప్పుడే ఫ్యాషన్, డిజైనింగ్‌ పట్ల మక్కువ పెంచుకుంది. అందుకే పెద్దయ్యాక ఫ్యాషన్‌ డిజైన్‌లో డిగ్రీ చేసింది. సంప్రదాయ కళకు ఆధునిక హంగులను జోడించి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించింది. ఆ సృజనే ఆమె బ్రాండ్‌ వాల్యూగా మారింది. అంతేకాదు ఎంతో మంది గ్రామీణ మహిళలకు చక్కటి ఉపాధినీ ఇస్తోంది. ఆమె ప్రత్యేకతల్లో ఇంకో మాటా చేర్చాలి. అనీతా డోంగ్రే డిజైన్స్‌ పర్యావరణ ప్రియంగా ఉంటాయి. రసాయన రంగులు, లెదర్, ఫర్‌ వంటివి ఉండవు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top