Sagubadi: మొక్కలకు ఫర్టిలైజర్, పేస్ట్‌ కంట్రోల్‌ గా ఉపయోగపడే వేప పిండి.. | Sagubadi: Neem Cake Serves As A Fertilizer And Pest Control Agent For Plants | Sakshi
Sakshi News home page

Sagubadi: మొక్కలకు ఫర్టిలైజర్, పేస్ట్‌ కంట్రోల్‌ గా ఉపయోగపడే వేప పిండి..

Jun 12 2026 8:28 AM | Updated on Jun 12 2026 8:29 AM

Sagubadi: Neem Cake Serves As A Fertilizer And Pest Control Agent For Plants

Sagubadi: ఇంటి పంట

మొక్కలకు ఫర్టిలైజర్, పేస్ట్‌ కంట్రోల్‌ గా ఉపయోగపడే వేప పిండి గురించి తెలుసుకుందాం. మిద్దె తోటలోని పువ్వులు, పండ్లు, కూరగాయల మొక్కలకు వేప పిండిని ఇలా వాడవచ్చు..

1. మొక్కలు నాటడానికి కుండీలలో మట్టిని సిద్ధం చేసేటప్పుడే వేప పిండిని కలపడం అత్యంత ఉత్తమమైన సమయం. 
2. మట్టి మిశ్రమంలో తప్పనిసరిగా 10% వేప పిండి కలపాలి.
3. ఇది మట్టిలో ఉండే హానికరమైన నులిపురుగులు, శిలీంధ్రాల నుండి వేర్లకు రక్షణ ఇస్తుంది. 
4. మొక్కలు పెరుగుతున్న సమయంలో కూడా నెలకు ఒకసారి వేప పిండిని ఎరువుగా వేయవచ్చు. 
5. కుండీలోని మట్టిని పైన కొద్దిగా తవ్వి మొక్క సైజును బట్టి ఒక గుప్పెడు వేప పిండిని వేసి, మట్టితో క΄్పాలి.
6. ఇది మొక్కలకు నత్రజని, ఇతర పోషకాలను నిలకడగా అందిస్తుంది.

వేప పిండి ద్రావణం 
7. మొక్కలకు చీడపీడలు ఆశించినప్పుడు లేదా నివారణగా వేప పిండి ద్రావణాన్ని వాడవచ్చు. 
8. అర కిలో వేప పిండిని 10 లీటర్ల నీటిలో కలిపి 2 రోజుల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ ద్రావణాన్ని వడకట్టి, మరో 10 రెట్లు నీరు కలిపి మొక్కల మొదళ్లలో పోయవచ్చు.
9. ఈ ద్రావణాన్ని ఆకులపై ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయడం వల్ల ఆకులను తినే పురుగులు దూరమవుతాయి. 
10. అతిగా వేయకూడదు. 12 అంగుళాల కుండీకి 50–100 గ్రాముల ΄÷డి సరిపోతుంది.
11. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులపై వేప ద్రావణాన్ని పిచికారీ చేయవద్దు, ఇది ఆకులను కమిలిపోయేలా చేస్తుంది.
12. కల్తీ లేని, తాజాగా ఉండే వేప పిండిని ఎంచుకోవాలి. - కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్‌: 94906 02366

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌ 

Advertisement
 
Advertisement
Advertisement