Drunkenness Disease: తాగకపోయినా... తాగినట్టే మత్తుగా ఉంటుందా? ఆ జబ్బేంటో తెలుసా?

Saccharomyces Microorganism causes cerevisiae drunkenness disease - Sakshi

ఒకవేళ ఎవరికైనా ఈ జబ్బు ఉందంటే... పొరబాటున వారు వాహనం నడిపేటప్పుడు  పోలీస్‌ చెకింగ్‌ గానీ జరిగిందంటే... అది వారి పాలిట సమస్యే అవుతుంది. నిజానికి వారు మద్యం తాగకపోయినప్పటికీ... బ్రెత్‌ అనలైజర్‌తో పరీక్ష చేశారంటే మద్యం తాగితే వచ్చే ఫలితమే కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘‘డ్రంకెన్‌నెస్‌ డిసీజ్‌’’  అంటారు. 
ఎందుకు జరుగుతుందంటే...? 
ఈ జబ్బు ఉన్నవారిలో వాళ్లు తిన్న కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) ఎప్పటికప్పుడు ఆల్కహాల్‌గా మారిపోతుంటాయి. అందుకే ఈ వైద్య సమస్యను ‘బీర్‌ గట్‌’ (బీరుతో నిండిన కడుపు / కడుపు నిండా బీరు) లేదా గట్‌ ఫర్మెంటేషన్‌ సిండ్రోమ్‌ / ఆటో బ్రూవరీ సిండ్రోమ్‌ అని కూడా అంటారు. ఈ పరిస్థితి కారణంగా తాగక పోయినా మత్తు వచ్చేస్తుంది. అవాంఛితమైన ఆ మత్తు కారణంగా ప్రమాదాలూ జరగవచ్చు. బాధితులలో భౌతికంగా కూడా చాలా సమస్యలూ వస్తుంటాయి. ఉదాహరణకు మద్యం తాగినప్పుడు చాలామందిలో కనిపించే లక్షణమైన నోరంతా ఎండిపోవడంతో పాటు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్, దీర్ఘకాలికంగా నిస్సత్తువ ఉండటం వంటివెన్నో కనిపిస్తాయి. దాని వల్ల డిప్రెషన్‌లోకి కూడా జారిపోవచ్చు. వాళ్ల జీర్ణకోశంలో ఉండే ‘శాకరోమైసిస్‌ సెరివిసీ’  అనేఒక రకమైన సూక్ష్మజీవి వల్ల ఇలా జరుగుతుంది. 

చికిత్స ఏమిటి? 
పిండిపదార్థాలను పూర్తిగా నివారించడం, అలాగే బాధితులకు ఎప్పుడూ హై ప్రోటీన్‌ ఆహారాన్ని ఇవ్వడంలాంటి ‘డైట్‌ థెరపీ’తో డాక్టర్లు ఈ సమస్యకు చికిత్స అందిస్తారు. కొందరికి యాంటీ ఫంగల్‌ / యాంటీ బ్యాక్టీరియల్‌ మందుల చికిత్స అవసరమవుతుంది. శాకరోమైసిస్‌ సెరివిసీ అనేది ఈస్ట్‌ లాంటి మైక్రోబ్‌ వల్ల ఈ జబ్బు వస్తుంది కాబట్టి డాక్టర్లు యాంటీఫంగల్‌ మందులతో, సూక్ష్మజీవులను అరికట్టే యాంటీ బయాటిక్స్‌తోనూ ఈ సమస్యను అదుపు చేసే ప్రయత్నం చేస్తారు.    

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top