వాలెట్‌ పవర్‌..! | The Power of Wallets: How One Utility Company | Sakshi
Sakshi News home page

వాలెట్‌ పవర్‌..!

Jun 7 2026 8:53 AM | Updated on Jun 7 2026 8:53 AM

The Power of Wallets: How One Utility Company

ప్రపంచంలో గుండెపోటు కంటే, జేబులో పర్స్‌ లేనప్పుడు వచ్చే ‘జేబుపోటు’ చాలా డేంజర్‌! ప్రేమలో అయినా, పెళ్లిచూపుల్లో అయినా, ఫ్రెండ్స్‌తో బిర్యానీ పార్టీల్లో అయినా మన గౌరవాన్ని కాపాడేది ఒక్క ‘మనీ పర్స్‌’ పల్స్‌ మాత్రమే! ఇలా ప్రపంచాన్ని మొత్తం మోసే పాకెట్‌ వాలెట్‌ ఫ్యాషన్‌లోనూ మీ రేంజ్‌ పెంచేయగలదు. మీరు కనుక ఈ లేటెస్ట్‌ ట్రెండ్స్, వాటి సీక్రెట్స్‌ తెలుసుకుంటే!

ది మోడ్రన్‌ లైనప్‌
ఇది ఒక మినిమలిస్ట్‌ కార్డ్‌ హోల్డర్‌. క్యాష్‌ కంటే కార్డ్స్, యూపీఐలే ఎక్కువ వాడేవాళ్లకి ఇది బెస్ట్‌. చిన్నగా, స్లిమ్‌గా ఉంటుంది. జేబులో పెట్టుకున్నా ‘ఏమీ లేనట్టు’ ఫీల్‌ వస్తుంది. క్లీన్‌ , మోడ్రన్‌ , అల్ట్రా స్టయిలిష్‌.

క్లాసిక్‌ బై–ఫోల్డ్‌
ఇది ఎప్పటికీ ఔట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌  కాని జెంటిల్‌మన్‌  స్టయిల్‌ వాలెట్‌. క్యాష్, కార్డ్స్‌ రెండూ క్యారీ చేయాలనుకునేవాళ్లకి ఇది పర్‌ఫెక్ట్‌. కానీ, ఇందులో పాత బిల్లులు, సినిమా టికెట్లు, ఫుడ్‌ కూపన్స్‌ అన్నీ నింపేస్తే, వాలెట్‌ కంటే చిన్న ఫైల్‌లా కనిపించే చాన్స్‌ ఉంది!

స్మార్ట్‌ మనీ క్లిప్‌
నోట్లను ఫోల్డ్‌ చేసి మధ్యలో క్లిప్‌తో లాక్‌ చేసే ఈ స్టయిల్‌ ఇప్పుడు ఫుల్‌ ట్రెండ్‌లో ఉంది. జీన్స్‌ ఫ్రంట్‌ పాకెట్‌లో పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. షార్ప్, రిచ్‌ మ్యాన్‌ ఎన ర్జీ వైబ్‌ ఇస్తుంది.

లెదర్‌ అంటే ఎప్పటికీ క్లాస్‌
ఫుల్‌ గ్రెయిన్‌  లెదర్‌ వాలెట్స్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాయి. బ్లాక్, డార్క్‌ బ్రౌన్‌, టాన్‌కలర్స్‌ అయితే ఏ అవుట్‌ఫిట్‌కైనా ఈజీగా మ్యాచ్‌ అవుతాయి. ఇప్పుడు కార్బన్‌  ఫైబర్, క్యాక్టస్‌ లెదర్‌లాంటి కొత్త మెటీరియల్స్‌ కూడా ట్రెండ్‌లోకి వచ్చేశాయి. అంటే, వాలెట్‌లో కూడా టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చేసింది అన్నమాట!

కలర్స్‌ కూడా క్యారెక్టర్‌ చెప్పేస్తాయి
బ్లాక్‌ వాలెట్‌ అంటే క్లాసీ వైబ్‌. బ్రౌన్‌ అంటే రిచ్‌ లుక్‌. టాన్‌ అంటే ట్రెండీ స్టయిల్‌! నేవీ బ్లూ లేదా ఆలివ్‌ గ్రీన్‌  అయితే ‘ఈయనకి ఫ్యాషన్‌  గురించి తెలుసు’ అనే ఫీలింగ్‌ వస్తుంది.

ఔట్‌ఫిట్‌కి మ్యాచ్‌ చేయాలి
ఫార్మల్‌ డ్రెస్‌ వేసుకున్నప్పుడు ప్రీమియం లెదర్‌ బై–ఫోల్డ్‌ బెస్ట్‌. జీన్స్, టీషర్ట్‌తో అయితే స్లిమ్‌ కార్డ్‌ హోల్డర్‌ లేదా మనీ క్లిప్‌ సూపర్‌గా సెట్‌ అవుతుంది. ట్రావెల్‌ టైమ్‌లో జిప్‌ వాలెట్స్, పాస్‌పోర్ట్‌ హోల్డర్స్‌ చాలా యూజ్‌ఫుల్‌. అయితే, ఇక్కడ రూల్‌ ఏంటంటే, మీ వాలెట్‌ కలర్, మీ బెల్ట్‌ లేదా షూస్‌ కలర్‌కి మ్యాచ్‌ అయితే, లుక్‌ ఆటోమేటిక్‌గా రిచ్‌గా కనిపిస్తుంది.

జాగ్రత్తలు!
వాలెట్‌ని ఎక్కువగా నింపేయొద్దు. అలా చేస్తే, జేబులో చిన్న దిండు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. 

చాలా చీప్‌గా కనిపించే మెటీరియల్‌ అస్సలు వద్దు. మంచి క్వాలిటీ వాలెట్‌ అయితేనే క్లాస్‌గా ఉంటుంది.

బ్యాక్‌ పాకెట్‌లో పెట్టుకుని కూర్చుంటే వాలెట్‌ షేప్‌ కూడా మారిపోతుంది. కాబట్టి, ఫ్రంట్‌ పాకెట్‌లో పెట్టుకోవడం బెటర్‌. 

(చదవండి: నారికేళంతో నయన సంరక్షణ..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement