కరోనా: గుడ్లు, చికెన్, చేపలు తినాలి .. శాకాహారులైతే

Nutritionist Ritika Samaddar Suggestions To Increase Immunity - Sakshi

నాన్‌వెజ్‌ తినేవారికి
కరోనా రోగికి దాని తీవ్రతను బట్టి కిలోకు 1 గ్రాము నుంచి 1.5 గ్రాము దాకా ప్రొటీన్‌ ఇవ్వాల్సి వస్తోంది. ఈ ప్రొటీన్స్‌ను ఆహారం ద్వారా అందుకోవాలంటే గుడ్లు, చికెన్, చేపలు తదితర నాన్‌వెజ్‌తో లభిస్తాయి. 

శాకాహారులైతే పప్పు దినుసులు, పప్పులు.. 
శాకాహారులైతే పప్పు దినుసులు, కందిపప్పు, పెసర, మినప్పప్పు తదితరాల్లో 24 శాతం వరకు ప్రొటీన్‌ ఉంటుంది. అలాగే బొబ్బర్లు, రాజ్మా, శనగలు వంటి వాటిలో ప్రొటీన్‌తో పాటు బి విటమిన్, పీచు పదార్థాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పాల సంబంధ ఉత్పత్తులు చీజ్, పన్నీర్‌తో పాటు సీడ్స్, నట్స్‌ నుంచి కూడా ప్రొటీన్స్‌ అందుతాయి. ముఖ్యంగా సీడ్స్, నట్స్‌లో ఉండే ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ మేలు చేస్తాయి.

సప్లిమెంట్స్‌ అవసరమే కానీ.. 
విటమిన్లు సప్లిమెంట్స్‌ రూపంలో కూడా లభిస్తున్నాయి. కరోనా తీవ్రతను బట్టి సప్లిమెంట్స్‌ తీసుకోవడం అవసరమే. ఇవి కూడా మనిషి, మనిషికీ మారుతుంటాయి. ఉదాహరణకు ఎప్పుడూ ఏసీలో ఉండే వారికి విటమిన్‌ డి తప్పనిసరి. అయితే వీలైనంతగా సహజ పద్ధతుల్లో, ఆహారం ద్వారా లభించేలా చూసుకోవాలి. ఎక్కువ సప్లిమెంట్స్‌ తీసుకుంటే పౌష్టికాహార సమతుల్యత దెబ్బతింటుంది.

రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి?  
పోషకాలు అధికంగా కలిగిన ఆహారం శక్తివంతమైన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. బాదం పప్పులో పోషకాలు అధికం. విటమిన్‌–ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయడంతో పాటుగా శ్వాస సంబంధిత రోగ నిరోధక వ్యవస్ధకూ తోడ్పడుతుంది. ఇందులో జింక్, ఐరన్‌ సైతం ఉంటాయి. అలాగేప్రొ బయాటిక్‌ అధికంగా కలిగిన పెరుగు ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. వ్యాధికారకాల (పాతోజెన్స్‌)కు వ్యతిరేకంగా రక్షణను మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది. దీనిలో కాల్షియం, మినరల్స్, విటమిన్స్‌ కూడా ఉంటాయి. పచ్చి మామిడిలో విటమిన్‌ ఏ తో పాటు సీ కూడా అధికంగా ఉంటుంది. 
– రితికా సమద్దార్, డైటెటిక్స్, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top