శరీరాన్ని కాన్వాస్‌గా మార్చి..టాటులతో గిన్నిస్‌ రికార్డు..! | Canadian Man Jeremy Remy Schofield Sets Guinness World Record With Tattoos Covering Over 90% Of His Body | Sakshi
Sakshi News home page

శరీరాన్ని కాన్వాస్‌గా మార్చి..టాటులతో గిన్నిస్‌ రికార్డు..! ఏకంగా 40 పొరలు..

Oct 12 2026 12:19 PM | Updated on Oct 12 2026 12:58 PM

 Meet Jeremy Remy Schofield With 90 Percent Of His Body Covered In Tattoos

సరదాగా వేయించుకున్న పట్టుబొట్టు అతడికి తెలియకుండానే ఎంతటి వ్యసనంగా మారిందంటే..మొత్తం బాడీ పచ్చబొట్ల మయం అయిపోయింది. ఆ హాబీ అతనికి గిన్నిస్‌ రికార్డులకెక్కేలా చేసింది. అతడే కెనడాకు చెందిన ఎఫెమెరల్‌ రెమీగా పిలిచే జెరెమీ రెమీ స్కోఫీల్డ్‌. తన శరీరంలో  90% పైగా పచ్చబొట్లతో నింపేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్‌ దక్కించుకున్నాడు. నిజానికి ఇలా పంచబొట్టు వేయించుకోవడం 2005లో  మొదలైంది. ముందుగా తన కొడుకు పేరును ఎడమ ముంజేతిపై సరదాగా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. 

ఆ తర్వాత కొద్ది కాలానికే శరీరం మొత్తం పచ్చబొట్లతో నిండిపోయింది. కానీ అక్కడతో ఆగకుండా అల్బెర్టాకు చెందిన ఈ 38 ఏళ్ల వ్యక్తి ఏళ్లు గడిచే కొద్దీ పొరల మీద పొరలు వేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా అతని చర్మంపై సుమారు 40 పొరల పచ్చబొట్లు పేరుకుపోయాయి. అతని శరీరంలో కొన్ని ప్రాంతాలు వందకు పైగా పచ్చబొట్టు నింపేశాడు. ఇలా ప్రపంచంలోనే అత్యధిక పొరల పచ్చబొట్లు వేయించుకున్న వ్యక్తిగా అతను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2027లో చోటు దక్కించుకున్నాడు. అప్పటికే శరీర మార్పుల పట్ల అభిమానం ఉంది. అతని శరీరంపై వందకు పైగా పియరింగ్స్‌లు ఉన్నాయి. 

అయితే తనకు శరీరం మొత్తం పచ్చబొట్లతో నిండిపోవాలని ఎప్పుడు అనుకోలేదని చెప్పుకొచ్చాడు. తనకు ఎప్పుడు విచిత్రమైన హెయిర్‌స్టైల్స్‌ ఉండేవి, గోతిక్‌ తరహాలో దుస్తులు ధరించేవాడిని, కానీ ఇలా పచ్చబొట్లు వేయించుకుంటానని ఎప్పుడు ఊహించలేదని వాపోయాడు. తాను ఇల్లు కొనుక్కుని ఆర్థికంగా స్థిరపడ్డాక ఇంతకాలం కోల్పోయిన సమయాన్ని తిరిగి పొందాలనే ఉద్దేశ్యంతో తనకిష్టమైన పచ్చబొట్లు హాబీని మొదలు పెట్టానని. అందులో చిన్ని చిన్న మార్పులు చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చేదని, అలా అదొక వ్యసనంగా మారిపోయి..ఇన్ని పచ్చబొట్లు వేయించుకునేందుకు దారితీసిందని చెప్పుకొచ్చాడు రెమీ. 

ప్రస్తుతం అతడు టాటు షాపులు, సోషల్‌ మీడియా కంపెనీలు నిర్వహిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే అతడి శరీరంపై ఉండే టాటుల..తన జ్ఞాపకాల మూటలు అని చెబుతున్నాడు. అందులో పేరెంట్స్‌, కుక్కుల, జ్ఞాపకార్థ పోర్ట్రెయిట్‌లట. అలాగే 2016లో మరణించిన తన కుమారుడు తల్లి కోసం కూడా టాటు వేయించుకున్నాడట. అయితే ముఖంపై మాత్రం టాటులు వేయించుకోకుండా వదిలేశాడు. ఎందుకంటే తనను తాను సులబంగా గుర్తించేందుకని నవ్వుతూ చెబుతున్నాడు. ఇలా వరల్డ్‌ రికార్డు సాధించాక కూడా రెమీ టాటులు వేయించుకోవడం ఆపకపోవడం విశేషం.

 

 ఇదీ చదవండి: హాబీతో కేన్సర్‌ని జయించింది..! వైద్యానికే అందని మిరాకిల్‌..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement