మోగింది వీణ... నెటిజనుల గుండెలలోనా!

Medical student Kushala masterfully played the calming melody on the veena - Sakshi

పాటలలో వీణ పాటల తీయదనం వేరయా! మన తెలుగులోనైతే ‘లీలాకృష్ణా నీ లీలలు’ ‘ఈ వీణపైన పలికిన రాగం... నాలో విరిసిన అనురాగం’లాంటి ఎన్నో పాటలు గుర్తు వస్తాయి. హిందీలోనైతే ‘మేరీ వీణ తుమ్‌ బిన్‌ రోయే’ (దేఖ్‌ కబిర రోయా–1957)లాంటివి ఎన్నో గుర్తు వస్తాయి.

ఇక అసలు విషయానికి వస్తే... వరుణ్‌ ధావన్, కృతి సనన్‌ జంటగా నటించిన హిందీ సినిమా ‘బేడియా’ లోని ‘అప్నా బనా లే పియా’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. సచిన్‌–జిగర్‌ ద్వయం కంపోజ్‌ చేసిన ఈ పాటను కుశాల అనే మెడిసిన్‌ స్టూడెంట్‌ వీణపై అద్భుతంగా ప్లే చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వేలాది లైకులను సొంతం చేసుకుంది. ఈ వీడియో నేపథ్యంలో నెటిజనులు భారతీయ సినిమాలలోని ప్రసిద్ధ వీణ పాటలను గుర్తు తెచ్చుకున్నారు. రాగాల గురించి వివరంగా మాట్లాడుకున్నారు. కొందరు మాత్రం ‘మన సినిమాలో వీణ పాటలు బొత్తిగా కరువయ్యాయి’ అంటూ కడు విచారం వ్యక్తం చేశారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top