ఆ పెట్రోల్‌ బంక్‌లో మూడు రోజులపాటు పెట్రోల్‌ ఫ్రీ.. కారణం ఇదేనట!! 

Madhya Pradesh Petrol Pump Owner Distributed Free Petrol To Celebrate Birth Of Niece - Sakshi

పెట్రోల్‌, డీజిల్‌ ఈ రోజుల్లో చాలా ఖరీదైనవి. ప్రతిఒక్కరూ.. ఆచి తూచి జాగ్రత్తగా వాడుతున్నారు. మరి ఎవరైనా ఫ్రీగా ఇస్తానంటే మీరేం చేస్తారు? వెంటనే రెక్కలు కట్టుకునిమరీ అక్కడ వాలిపోతారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పెట్రోల్‌ బంక్‌ ఓనర్‌ ఏకంగా మూడు రోజులపాటు వచ్చిన కస్టమర్లందరికీ ఫ్రీ పెట్రోల్‌ ఇచ్చాడు. తమ ఇంట ఆడపిల్ల పుట్టిందనే సంతోషంతో ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడట..

చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..!

బేతుల్‌ జిల్లాకి చెందిన దీపక్‌ సైనాని అనే వ్యక్తి, తన చెల్లెలికి అక్టోబర్‌ 9న ఆడపిల్ల పుట్టింది. మేనకోడలు పుట్టిన సంబరంలో దీపక్‌ సైనాని పెట్రోల్‌ బంకుకు వచ్చిన కష్టమర్లందరికీ పెట్రోల్‌, డీజిల్‌ ఫ్రీ అని ప్రకటించాడు. 

దసరా నవరాత్రుల వేళ అక్టోబర్‌ 13, 14, 15 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్‌ ఉచితం అని ప్రకటించాడు. రూ.100లకు పెట్రోల్‌ కొన్న కస్టమర్లకు 5 శాతం, 200 - 500 రూపాయలకు పెట్రోల్‌ కొన్నవారికి 10 శాతం పెట్రోల్‌ ఫ్రీగా అందించానని స్థానిక మీడియాలు వెల్లడించాడు. కాగా గత కొంతకాలంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశానుంటుతున్న విషయం తెలిసిందే! ఇటువంటి సమయంలో మూడురోజుల పాటు వాహనదారులకు ఉచితంగా పెట్రోల్‌ అందించడంతో దీపక్‌ సైనాని వార్తల్లో నిలిచాడు.

అంతేకాకుండా ఆడపిల్ల పుడితే వెంటనే ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించే ఈ రోజుల్లో, ఇంత విలువైన బహుమతి మేకోడలికి అందించిన అతని ఉన్నతమనసును చాటిచెబుతోంది.

చదవండి: ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top