Big Mango: యే దిల్‌ ‘మ్యాంగో’ మోర్‌.. | Local To Global Photo Feature in Telugu May 02 2021, Guinness World Record Big Mango | Sakshi
Sakshi News home page

Big Mango: యే దిల్‌ ‘మ్యాంగో’ మోర్‌..

May 2 2021 2:26 PM | Updated on May 2 2021 2:26 PM

Local To Global Photo Feature in Telugu May 02 2021, Guinness World Record Big Mango - Sakshi

సమ్మర్‌.. అంటే మామిడి పళ్ల సీజన్‌.. ఒకదాని మీద ఒకటి ఆపకుండా లాగించేసేవాళ్లు ఎందరో.. అయితే, చిత్రంలోని మామిడి పండును మాత్రం ఒకదాని మీద ఒకటి లాగించేయాలంటే అస్సలు కుదరదు.. ఎందుకంటే.. ఈ పండు బరువే అచ్చంగా 4.25 కిలోలు! చూశారుగా.. మిగతావాటితో పోలిస్తే.. ఏ సైజులో ఉందో.. చివరికి గిన్నిస్‌ వారు కూడా నోరెళ్లబెట్టేసి.. ప్రపంచంలోనే అత్యంత బరువైన మ్యాంగోగా దీనికి రికార్డు కట్టబెట్టేశారు. గత రికార్డు 3.43 కిలోలుగా ఉంది. పండు ఒకే.. ఇంతకీ అది ఎక్కడ కాసిందో చెప్పలేదు కదూ.. కొలంబియాకు చెందిన జర్మన్‌ ఒర్లాండో, రీనాలకు చెందిన తోటలోనిది భారీ ఫలం. రికార్డు బద్దలు కాగానే.. పండును కుటుంబమంతా కలిసి ఆరగించారట. 

1
1/6

ఈ చిత్రంలోని రామచిలుక మధ్యప్రదేశ్‌కు చెందినది. అక్కడినుంచి వచ్చిన వలస కార్మికులు వారు ప్రేమతో పెంచుకున్న చిలుకను కూడా తీసుకువచ్చారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని టైలర్స్‌ కాలనీలో మిషన్‌ భగీరథ పనులు చేస్తున్న సమయంలో ఆ రామచిలుక యజమాని నీలూబాయి భుజానకెక్కింది. ఆమె పనిచేస్తున్న సమయంలో ఆ చిలుక ఆమెకు తోడుగా ఉంటూ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌

2
2/6

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురు గాలులతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో రంగుమారిన ఆకాశం ప్రజలకు కనువిందు చేసింది. – సాక్షి ఫోటోగ్రాఫర్, నిర్మల్‌

3
3/6

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి ప్రసాదాల తయారీకి గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యాన్ని వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన లడ్డూలను పరిశీలిస్తున్న వైవీ సుబ్బారెడ్డి.

4
4/6

అస్తమించే వేళ ఆదిత్యుడు ‘స్వర్ణ’కాంతులు వెదజల్లాడు. చూపరులకు నేత్రానందం కలిగించాడు. ఈ దృశ్యం శుక్రవారం సాయంత్రం కర్నూలులో కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌

5
5/6

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్‌ అధికమవుతోంది. సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా టీకా లేదంటూ శనివారం ఇలా నోటీసు అతికించారు.

6
6/6

కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. కరోనా బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. రాజధాని బెంగళూరులో ఓ ఆసుపత్రి ఎదుట ‘బెడ్‌ ఫుల్‌’ అనే నోటీసును అతికించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement