లీఫ్‌ ఆర్ట్‌: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్‌! | Sakshi
Sakshi News home page

లీఫ్‌ ఆర్ట్‌: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్‌!

Published Sun, Feb 18 2024 12:07 PM

Leaf Art In Home Decoration Becomes New Trend - Sakshi

ఇంటీరియ్‌లో వుడెన్‌ వర్క్‌ గురించి తెలిసిందే. ఇప్పుడు ఆకులు కూడా కొత్త పాత్ర పోషిస్తున్నాయి. రాలిన ఆకులను కొన్ని రోజుల పాటు నానబెట్టి, వాటి  పలచని పొరను కూడా ఉపయుక్తంగా మార్చి, ఇంటి అలంకరణకు ఉపయోగిస్తున్నారు డిజైనర్లు. లీఫ్‌ ఆర్ట్‌గా పేరొందిన ఈ కళ ఇంటికి కొత్త శోభనిస్తోంది. బర్డ్స్‌గా, ఫెదర్స్‌గా, బెడ్‌ ల్యాంప్స్‌గా, ఎంబ్రాయిడరీ వర్క్‌తోనూ ఆకులుకొత్త సింగారాన్ని నింపుకుంటున్నాయి.

 స్కెలిటన్‌ లీవ్స్‌ తయారీకి.. 

1.    ఒక గిన్నెలో పది ఆకులను తీసుకొని, అందులో కప్పు సోడా వాటర్‌ పోయాలి. ఆకులు మునిగేలా నీళ్లు పోసి, సన్నని మంట మీద నీళ్లను మరిగించాలి. ఆకులు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. 
2.    ఆకులను బయటకు తీసి, చల్లని నీళ్లలో వేయాలి. 
3.    ఒక్కో ఆకు తీసుకొని, తడి ఆరాక టూత్‌ బ్రష్‌తో మెల్లగా రబ్‌ చేస్తూ, పై పొట్టును తీసేయాలి.  
4.    పొట్టు తీసేసిన ఆకులన్నిటినీ బ్లీచ్‌ నీళ్లలో వేసి రెండు గంటలు ఉంచాలి. 
5.    తర్వాత నీళ్లు పోయేలా ప్రతి ఆకును టిష్యూ పేపర్‌తో అద్ది, పక్కనుంచాలి. దీని వల్ల ఆకు పైపొర పూర్తిగా పోయి, స్కెలిటన్‌ భాగం తయారవుతుంది.
6.    ఈ ఆకులను ఎండబెట్టి, అలంకరణకు తగినట్టుగా తయారుచేసుకోవచ్చు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement