కొత్త.. రుచుల కోకా కట్టుకున్నదీ పేట.. | Kokapet Is Emerging As Hyderabad's Next Big Food Hub | Sakshi
Sakshi News home page

కొత్త.. రుచుల కోకా కట్టుకున్నదీ పేట..

Feb 15 2025 11:57 AM | Updated on Feb 15 2025 12:07 PM

Kokapet Is Emerging As Hyderabad's Next Big Food Hub

ఒకప్పుడు తెంగాణలోని హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతంగా ఉన్న కోకాపేట్‌ ఇప్పుడు ఐటీ నిపుణుల ప్రవాహంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కార్పొరేట్‌ కల్చర్‌కు తోడు స్కై స్క్రాపర్స్, అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు నగరానికి విలాసవంతమైన కేంద్రంగా మారుతోంది. దీంతో ఉన్నతస్థాయి ఫైన్‌–డైనింగ్‌ రెస్టారెంట్‌ల నుంచి కేఫ్స్, స్ట్రీట్‌ ఫుడ్‌ వరకూ ఇక్కడ అందుబాటులోకి వచ్చేశాయి. రుచికరమైన భోజనం, స్పీడ్‌ బ్రేక్‌ ఫాస్ట్, అల్పాహారం లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలనుకుంటే అధునాతన కేఫ్‌ కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి తప్పకుండా సిద్ధంగా ఉంటుంది.  

ఒకప్పుడు కొన్ని తినుబండారాలకే పరిమితమైన ఈ ఏరియాలో ఇప్పుడు ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్‌లు, ట్రెండీ కేఫ్‌లు మాత్రమే కాదు స్ట్రీట్‌ఫుడ్‌లతో డైనమిక్‌ మిక్స్‌గా రూపాంతరం చెందింది. కోకాపేట్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా ఫుడ్‌ బ్రాండ్స్‌ ఇక్కడకు విస్తరిస్తున్నాయి, వినూత్న మెనూలను మోసుకొస్తున్నాయి.  

సంప్రదాయ రుచులు ఆధిపత్యం చెలాయించే నగరంలోని మరికొన్ని సంప్రదాయ ప్రాంతాల వలె కాకుండా, కోకాపేట్‌లో మల్టీ క్యుజిన్‌ రెస్టారెంట్‌లు, ఆర్టిసానల్‌ బేకరీలు ప్రయోగాత్మక ఫ్యూజన్‌ కిచెన్‌లు స్థానిక కాస్మోపాలిటన్‌ కల్చర్‌ను ప్రతిబింబిస్తాయి. వీకెండ్‌ బ్రంచ్‌ స్పాట్‌లు, రూఫ్‌టాప్‌ డైనింగ్‌ అనుభవాలు, లేట్‌–నైట్‌ డెజర్ట్‌ కేఫ్‌లు కూడా ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయి, ఇవి యువ వృత్తి నిపుణుల జీవనశైలికి అద్దం పడుతున్నాయి.  

ఇవి డైన్‌–ఇన్‌ స్పేస్‌లకు మాత్రమే పరిమితం 
కాలేదు–క్లౌడ్‌ కిచెన్స్‌తో డెలివరీ–మాత్రమే కలిగిన బ్రాండ్‌లు కూడా ఇక్కడ తగిన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇవి ఇంటి నుంచి పని చేసేవారికి ప్రయాణంలో ఉన్న వారికి అవసరమైన సేవలు అందిస్తాయి. 

కోకాపేట్‌లో ఇప్పుడు అందుబాటులో ఉన్న వైవిధ్యమైన దాని నానాటికీ విస్తరిస్తున్న ఆహార సంస్కృతికి నిదర్శనం. కోకాపేట్‌ ప్రసిద్ధ బ్రాండ్‌ల మిశ్రమానికి నిలయంగా ఉంది. కోకాపేట్‌లోని కరాచీ కేఫ్, రోస్టరీ కాఫీ హౌస్, కేఫ్‌ శాండ్‌విచో, ప్రెజ్మో, కేఫ్‌ ట్వంటీ వన్, క్రెమా కేఫ్, రిఫ్లెక్షన్స్‌.. వంటి టాప్‌ కేఫె బ్రాండ్స్‌.. 

(చదవండి: వయసు 14 ఏళ్లే.. కానీ లక్ష మొక్కలు నాటింది..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement