ఆషాఢంలో అల్ల నేరేడు | java plum health benefits | Sakshi
Sakshi News home page

ఆషాఢంలో అల్ల నేరేడు

Jul 20 2024 11:06 AM | Updated on Jul 20 2024 11:06 AM

java plum health benefits

ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే, ఆషాఢంలో ఎండ వేడిమి తగ్గి, శరీరం నుంచి చెమట రూపంలోనూ, మూత్రం రూపంలోనూ నీరు అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ సీజన్‌లో నేరేడు పండు తినడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు.

అతి మూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరిగించి అరగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో పాఠాలుగా చదువుకుంటాం. దీనిని బట్టి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, వాతావరణంలోని మార్పులకు దేహం సరయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడుని ఔషధంలా ఉపయోగించాలని, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ అనే విషపదార్థాలను బయటకు పంపించడానికి నేరేడు మంచి మందనీ. దానిని తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుందనీ గ్రహించాలి. 

నేరేడు మనకు ఇంకా ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. 
చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.
పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.
రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.
మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
నీరసం, నిస్సత్తువ ఉన్న వారు  నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది.
వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి.
జిగట విరేచనాలతో బాధపడే వారు నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున తాగితే రోగికి శక్తి రావడంతో΄ాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.
కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.
మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి.
పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.

వీరు తినకూడదు..
అయితే నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. 
భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతో΄ాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement