
ICOMA's folding electric motorbike: ఈ ఫొటోలో కనిపిస్తున్నది సరికొత్త ఎలక్ట్రిక్ మోటారుసైకిల్. జపాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్ సంస్థ ‘ఇకోమా’కు చెందిన డిజైనర్లు మరో వాహన తయారీ సంస్థ ‘టాటామెల్’తో కలసి దీనికి రూపకల్పన చేశారు. ఒక మనిషి సునాయాసంగా ప్రయాణించేందుకు వీలుగా తయారు చేసిన ఈ–బైక్, గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో అసలు ప్రత్యేకతేమిటంటే, దీనికోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలమేదీ అవసరం ఉండదు. దీనిని శుభ్రంగా మడతపెట్టి, ఆఫీసులో టేబుల్ కింద పెట్టేసుకోవచ్చు. మడతపెట్టే వాహనాలు కొన్ని ఇప్పటికే తయారయ్యాయి గాని, అవేవీ ఇంత చక్కగా ఆఫీసు టేబుల్ కింద పట్టేంత సౌలభ్యం కలిగినవి కావు. దీని ధర ఇంకా ప్రకటించలేదు.