లెహంగాలో అదిరిపోతున్న జాన్వీ..ఆ నెక్లెస్‌ స్పెషాలిటీ ఏంటంటే..! | Sakshi
Sakshi News home page

లెహంగాలో అదిరిపోతున్న జాన్వీ..ఆ నెక్లెస్‌ స్పెషాలిటీ ఏంటంటే..!

Published Tue, May 28 2024 6:04 PM

Janhvi Kapoors Floral Lehenga Cricket Necklace For Mr And Mrs Mahi Promotions

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ వివిధ రకాల డిజైనర్‌ దుస్తులతో అబిమానులను అలరిస్తుంది. అంతకుమునుపు ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ధరించిన చీర కూడా హైలెట్‌గా నిలిచింది. ఆ చీరపై ఏకంగా మొత్తం క్రికెట్‌ స్టేడియంనే చక్కగాత్రీకరించారు. అదికూడా 1983 ప్రపంచకప్‌లో జరిగిన ఘట్టాన్ని చక్కగా చేతితో ఆవిష్కరించారు. అది మరువక మునుపే క్రికెట్‌ నెక్లెస్‌తో మనముందుకు వచ్చింది జాన్వీ.

డిజైనర్‌ అర్పితా మెహతా పూలా లెహంగా ధరించి మరీ చెన్నైలో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి ప్రమోషన్స్‌కు వచ్చింది. క్రికెట్‌తో తీసిన మూవీకి ఆమె ధరించిన పూల లెహంగాకి సంబంధం ఎలా అని ఆశ్యర్యంగా ఉన్నా.. ఆమె ధరించిన నెక్లెస్‌ అందుకు చక్కటి సమాధానం ఇచ్చేలా నిలిచింది. ఆమె ధరించిన నెక్లెస్‌లో బ్యాట్‌, బాల్‌, వికెట్‌తో కూడిన లాకెట్‌ని చాల చక్కగా తీర్చిదిద్దారు. ఇది ఆమెకు మరింత ఆకర్షణీయమైన లుక్‌ని ఇచ్చింది. ఏదీఏమైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ అంచనాలను పెంచేలా జాన్వీ ఆహార్యం డ్రెస్సింగ్‌  స్టయిల్‌ హైలెట్‌గా ఉండటం విశేషం. 

 

అంతేగాదు జాన్వీ ధరించే ప్రతి డిజైనర్‌ డ్రెస్‌, చీరలు ఫేమస్‌ అయ్యి మూవీ ప్రమోషన్స్‌ రేంజ్‌ని పెంచాయి. పైగా ఈ ప్రమోషన్స్‌ ముగిసేలోగా ఆమె డ్రెస్సింగ్‌ స్టయిల్‌ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తుందేమో అన్నట్లు ఉంది ఆమె లుక్‌. చీర దగ్గర నుంచి లెహంగా వరకు ప్రతీది ఆమె మూవీకి తగ్గట్టు చాలా చక్కగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా మూవీ సారాంశాన్ని పరోక్షంగా తెలియజేసేలా నెక్లెస్‌ నుంచి చెవిపోగుల వరకు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుని డిజైన్‌ చేశారు. ఆ క్రికెట్‌ నెక్లెస్‌, ఆ అద్భుతమైన లెహంగాలో కొత్త జాన్వీని చూస్తున్నామనేలా మిస్మరైజ్‌ చేస్తోంది. 

 

(చదవండి: అంతర్జాతీయ బర్గర్‌ దినోత్సవం: ఎలా తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసా..!)
 

Advertisement
 
Advertisement
 
Advertisement