పొడి చర్మానికి తక్షణ నిగారింపు కోసం ఇలా చేయండి..

Instant Glow For Dry Skin - Sakshi

బ్యూటిప్స్‌

టేబుల్‌ స్పూను తేనెలో, టీస్పూను పెరుగు, అరటీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం ఇన్‌స్టంట్‌ నిగారింపుని సంతరించుకుంటుంది. 

  • ఈ ప్యాక్‌ పొడిచర్మానికి బాగా పనిచేస్తుంది 
  • జిడ్డు చర్మతత్వం గలవారు ఈ ప్యాక్‌లో తేనెను తక్కువగా వేయాలి 
  • తేనె, పెరుగు ముఖచర్మానికి చల్లదనం ఇవ్వడంతోపాటు తేమను అందిస్తాయి. 
  • రోజ్‌ వాటర్‌ చర్మాన్ని తేమగా ఉంచి, తాజాదనంతో కూడిన వర్ఛస్సునిస్తుంది. 
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top