How To Use Coffee As Covid 19 Taste Testing Tool, See Details Inside - Sakshi
Sakshi News home page

Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్‌ టెస్ట్‌ చేయొచ్చు... ఎలాగంటే..

Published Fri, Nov 19 2021 4:29 PM

Instant Coffee could predict COVID 19 Know The Facts - Sakshi

Coffee is Being Widely Used as a COVID-19 Diagnostic Tool: కాఫీ తాగేవారు కరోనాను ముందుగానే పసిగట్టేస్తారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాపించిన వారిలో రుచి, వాసన లక్షణాలు కోల్పోవడంతోపాటు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయనే విషయం తెలిసిందే! కొంత మంది వీటిని పసిగట్టలేకపోవడం కూడా చూస్తున్నాం! దీనికీ కాఫీకి సంబంధం ఏమిటనే కదా అనుకుంటున్నారు! ఉందండీ..

కాఫీ పరిమళాన్ని, రుచిని ఆశ్వాదిస్తూ తాగడం మనలోచాలా మందికి అలవాటే. కరోనాను పసిగట్టంలో కూడా ఇదే టెక్నిక్‌ ఉపయోగపడుతుంది. ఎప్పటిలా కాఫీ నుంచి వచ్చే కమ్మని పరిమళం మీ ముక్కును తాకడంలో ఏదైనా ఇబ్బంది కలిగినా.. లేక రుచిని తెలుసుకోలేకపోయినా వెంటనే అనుమానించవల్సిందే. కోవిడ్‌ను పసిగట్టడానికి పరిశోధకులు కాఫీనే ఎక్కువగా వాడుతున్నారట కూడా. వాసన చూడలేకపోయినవారిని పరీక్షిస్తే, వారిలో కోవిడ్‌ బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

మీకెప్పుడైనా కోవిడ్‌ గురించిన బెంగ పట్టుకుంటే వెంటనే ఈ కాఫీ టెస్ట్‌ చేసుకుంటే.. టెన్షన్‌ ఫ్రీ!!

చదవండి: Lingcod Fish Interesting Facts: ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు!!.. ఇప్పటికీ రహస్యమే..

Advertisement
Advertisement