'చిన్న ఇల్లే హాయి'..! వైరల్‌గా ఓ తల్లి మనోగతం | Indian origin Mom shared how small flat in London helped Goes Viral | Sakshi
Sakshi News home page

ఇల్లు చిన్నగా ఉంటేనే బెటర్‌ : ఓ తల్లి చెబుతున్న నమ్మదగిన వాస్తవాలు

May 8 2025 4:01 PM | Updated on May 8 2025 4:04 PM

Indian origin Mom shared how small flat in London helped Goes Viral

ఇల్లు చిన్నగా ఉంటేనే మంచిదనేది పెద్దల వచనం కూడా. ఇంటిని బట్టే రాబడి ఉంటుందని అంటుంటారు. ఎందుకంటే పెద్ద ఇల్లు అయితే అందుకు తగ్గ ఖర్చులు అధికంగా ఉంటాయి. మన ఆదాయానికి తగ్గ ఇల్లు అయితే ఖర్చు అదుపులో ఉంటుదనేది నానుడి. అయితే ఇప్పుడందరూ ఇల్లు విలాసవంతంగా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. పైగా అలా ఉండటం ఓ స్టాటస్‌ ఆఫ్‌ సింబల్‌గా కూడా మారింది. అందుకే ఇప్పుడు నగరాల్లో టు బెడ్‌ రూం, త్రీ బెడ్‌ రూం, విల్లా అంటూ సందడి చేస్తున్నాయి. కానీ ఇలాంటి ట్రెండింగ్‌ వాతారవరణంలో ఓ భారత సంతతి తల్లి మాత్రం చిన్న ఇల్లే ముద్దు అని అంటోంది. అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.

లండన్‌(London)లోని భారత సంతతికి(Indian origin) చెందిన మహిళ తన బిడ్డ, తల్లిదండ్రులతో కలసి చిన్న ఇంట్లోనే ఉండాలనుకుంటోంది. అక్కడే తన కొడుకు పెరగాలని ఎందుకు కోరుకుంటుందో కూడా వివరించింది. ఆ తల్లి పేరు నటాష్‌. తాను లండన్‌లో ఓ చిన్నఫ్లాట్‌లో తన ఏడు నెలల బిడ్డ, తల్లిదండ్రులతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. 

ఆమె అందుకు సంబంధించిన వీడియోని షేర్‌ చేసింది కూడా. ఆ వీడియోలో తాను లండన్‌లో ఇరుకైన ఆ చిన్న ఫ్లాట్‌లోనే ఎందుకు ఉండాలనుకుంటుందో, అందువల్ల  కలిగే ప్రయోజనాలేంటో కూడా వివరించింది. నిజానికి తాము బిడ్డ పుట్టక ముందే పెద్ద ఇంటికి మారాలని భావించామని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్ణయం మార్చుకుంటున్నట్లు వీడియోలో వివరించింది. అలా నిర్ణయం తీసుకోవడమే తనకు ఎంతో హెల్ప్‌ అయ్యిందని అంటోందామె. 

"చిన్న ఇంట్లో బిడ్డతో గడపడం అనేది కూడా ఓ టాలెంటే అంటోంది నటాషా. ఇలా ఎప్పుడైతే చిన్న ఇంటిలోనే ఉండాలనుకుంటామో...అప్పటి నుంచి ఖర్చుల పట్ల ఫోకస్‌ పెరుగుతుంది. అలాగే పరిమిత స్థలంలో ఇమిడిపోయే వస్తువులకు ప్రాధాన్యత ఇస్తూ..అనవసర ఖర్చులను అడ్డుకట్ట వేస్తాం. అలాగే ఇల్లు చిన్నగా ఉంటే..అస్తమాను శుభ్రం చేస్తూ..క్లీన్‌గా ఉంచుకునే యత్నం చేస్తాం. దీంతోపాటు బిడ్డ అవసరాలను త్వరగా గుర్తించగలిగే వెసులుబాటు కూడా ఉంటుందట. 

విశాలంగా పెద్దగా ఇల్లు ఉంటే..ఒక్కొక్కళ్లు ఓ మూలన ఉంటారు. పిల్లాడి ఏడుపు శబ్దం వినకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ల పక్కన తాత లేదా అమ్మమ్మ ఉంటే పర్లేదు..లేదంటే అంతే సంగతులు అని.."చిన్న ఇల్లు గొప్పదనాన్ని తనదైన శైలిలో భలే అందంగా వివరించింది నటాషా. 

యితే నెటిజన్లు ఆమె చెప్పినదానికి మద్దతిస్తూ..ఇది సరైనదే గాక అర్థవంతమైనది అని కితాబిచ్చారు. అంతేగాదు ఇలా చిన్న ఇంటిలో జీవనం సాగిస్తున్న వాళ్లందరికీ ఆమె చెప్పిన లాభాలు ఎంతగానో నచ్చాయి కూడా.

 

(చదవండి: నిండుగర్భిణి జోష్‌ఫుల్‌ స్టెప్పులు..చూస్తే షాకవ్వడం ఖాయం!)

 

Advertisement
 
Advertisement
Advertisement