నేరేడులో మనమే టాప్‌ | India is First largest producer of Jamun Fruit in world | Sakshi
Sakshi News home page

నేరేడులో మనమే టాప్‌

Jul 5 2026 3:09 AM | Updated on Jul 5 2026 3:09 AM

India is First largest producer of Jamun Fruit in world

నేరేడు పండును జంబూఫలం అంటారు. నేరేడు వల్లనే మన భారతదేశానికి జంబూద్వీపం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ శుభకార్యాలు, పూజాదికాలలో సంకల్పం చెప్పేటప్పుడు ‘జంబూద్వీపే భరతవర్షే భరతఖండే’ అని చెబుతుంటారు. నేరేడు పండు భారత ఉపఖండ ప్రాంతంలో విస్తారంగా పండుతుంది. వేసవి చివరి రోజుల నుంచి వర్షాకాలం వరకు విరివిగా దొరుకుతుంది.‘జంబూఫలం’ అనే పేరు నుంచే హిందీలో దీనికి ‘జామున్‌’ అనే పేరు వచ్చింది. పురాతన కాలంలోనే కాదు, ఇప్పటికీ నేరేడు ఉత్పాదనలో మన దేశమే అగ్రస్థానంలో కొనసాగుతోంది. నేరేడు ఉత్పాదనలో తొలి పది దేశాల గణాంకాలు చూద్దాం...

నేరేడులోని పోషకాలు
నేరేడును మధుమేహానికి విరుగుడుగా ఉపయోగిస్తారు. నేరేడు రసంతోను, నేరేడు గింజలతోనూ మధుమేహాన్ని అదుపు చేసే ఔషధాలు తయారవుతాయి. నేరేడు సహజసిద్ధంగా దొరికే పోషకఫలం. ఇందులోని పోషకాల వివరాలు తెలుసుకుందాం...

నేరేడు ఉత్పాదనలోనే కాకుండా, నేరేడు ఎగుమతుల్లోనూ మన భారతదేశం అగ్రగామిగా కొనసాగుతోంది. నేరేడు ఎక్కువకాలం నిల్వ ఉండే పండు కాదు. అందువల్ల ‘ఇతర తాజాపండ్లు’ కేటగిరీ కింద వీటి ఎగుమతికి పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటున్నాయి. నేరేడు వార్షిక ఎగుమతుల్లో టాప్‌–10 దేశాలు గణాంకాల్లో చూద్దాం...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement