కాంటాక్ట్‌ లెన్స్‌ వల్ల కళ్లకు ప్రమాదమా? | Improper Use Of Contact Lenses Can Cause Corneal Damage | Sakshi
Sakshi News home page

నటి జాస్మిన్‌ బాస్మిన్‌ ఘటన: కాంటాక్ట్‌ లెన్స్‌ వల్ల కళ్లకు ప్రమాదమా?

Jul 24 2024 1:14 PM | Updated on Jul 24 2024 3:56 PM

Improper Use Of Contact Lenses Can Cause Corneal Damage

బాలీవుడ్‌ నటి జాస్మిన్‌ భాస్మిన్‌కి ఎదురైన చేదు అనుభవం కాంటాక్స్‌ లెన్స్‌ వాడే వాళ్లందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. బాబోయ్‌ కాంటాక్ట్‌ లెన్స్‌ ఇంత ప్రమాదమా అని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ లెన్స్‌లు వాడచ్చా? దీని వల్ల కళ్లకు ప్రమాదమా? అంటే..

ఇటీవల్‌ బాలీవుడ్‌ నటి జాస్మిన్‌ బాస్మిన్‌ ఒక ఈవెంట్‌కి హాజరవ్వయ్యేందుకు కాంటాక్ట్‌ లెన్స్‌ ధరించింది. దీంతో కళ్లు విపరీతమైన నొప్పి వచ్చి కనిపించకుండా పోయింది. తీరా వైద్యల వద్దకు వెళ్తే కార్నియా తీవ్రంగా డ్యామేజ్‌ అయ్యిందని చెప్పి కళ్లకు బ్యాండేజ్‌ వేశారు. దీంతో ఒక్కసారిగా అందరిలో లెన్స్‌ వాడొచ్చా?. దీని వల్ల కళ్లకు సమస్యలు వస్తాయా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే నిపుణులు ఏమంటున్నారంటే..

ఎందువల్ల అంటే..
కార్నియా అనేది గోపురం-ఆకారపు కణజాలం. ఇది కంటి బయట స్పష్టమైన పొరను ఏర్పరుస్తుంది. ఇది మన దృష్టిని కేంద్రీకరించేలా లెన్స్‌లా పనిచేసే కీలకమైన రక్షణ పొర. కళ్లలోకి కాంతి ప్రవేశించినప్పుడు ఇది వక్రీభవించేలా చేస్తుంది. రెటినాకు, కార్నియాకు ఏదైనా నష్టం ఏర్పడితే కణజాలం దెబ్బతినడం జరుగుతుంది. ఈ కార్నియల్‌ దెబ్బతినడానికి పలు రీజన్‌లు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ప్రమాదాలు, శస్త్ర చికిత్సలు, లేదా వస్తువుల కారణంగా ఎదురయ్యే ప్రమాదాల్లో ఈ కార్నియా డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 

కార్నియ సమస్యలకు రీజన్‌..
కాంటాక్ట్‌ లెన్స్‌లను సరిగా వాడకపోతే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. యూవీ కిరణాలకు గురికావడం, మధుమేహం లేదా ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు, పోషకాహార లోపం తదితరాలు కార్నియా డ్యామేజ్‌కి గల కారణాలని చెబుతున్నారు వైద్యలు. అలాగే ప్రమాదాల్లో కన్ను దెబ్బతిన్న తీవ్రతను బట్టి ఇది డ్యామేజ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఇలా కార్నియా దెబ్బతింటే మాత్రం ఒక్కోసారి చూపుకూడా కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. 

లెన్స్‌లు హాని చేస్తాయా..?
లెన్స్‌లు సరిగా ఉపయోగించకపోతే కార్నియాకు ప్రమాదమనే చెబుతున్నారు వైద్యులు. అవి పరిశుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. లెన్స్‌లు తప్పుగా ఉపయోగించినట్లయితే కంటిపై ఒక విధమైన రాపిడి వచ్చి ప్రమాదం కలిగిస్తుంది. ఈ సమస్యలు చాలా అరదుగా జరిగేవే అయినా..సకాలంలో చికిత్స తీసుకోకపోతే కార్నియాపై మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాత్రిపూట లెన్స్‌లు ఉపయోగించటం వల్ల ఒక్కోసారి కార్నియా వాపుకి గురవ్వుతుంది.

ఎదురయ్యే సమస్యలు..

  • కంటి నొప్పి లేదా అసౌకర్యం

  • కంటిలో ఎరుపు 

  • కాంతికి సున్నితత్వం

  • ఉత్సర్గ

  • కంటిలో ఏదో ఉన్నట్లుగా పీలింగ్‌

చికిత్స: కార్నియల్‌ ఇన్ఫెక్షన్‌ను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దురద, తేలికపాటి సమస్యలకు ఐ డ్రాప్స్‌ ఇస్తారు. ఆ తర్వాత నుంచి కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడకం తగ్గించడం లేదా ప్రత్యేక కాంటాక్ట్‌ లెన్సులు ధరించడం వంటివి చేయాలి. 

లెన్స్‌లు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • నిపుణులు సూచించిన విధంగా లెన్స్‌లు, లెన్స్ కేసులను మార్చండి

  • లెన్స్‌లను ఎల్లప్పుడూ కాంటాక్ట్ లెన్స్ కేస్‌లో మాత్రమే ఉంచండి

  • ప్రతిసారీ తాజా ద్రావణాన్ని శుభ్రం చేయడానికి, అలాగే ఉపయోగించేందుకు రాత్రిపూట లెన్స్‌ను ద్రావణంలో ఉంచండి

  • లెన్స్ డ్యామేజ్ కాకుండా ఉండేలా సురక్షిత క్లాత్‌ని ఉపయోగించండి.

  • నేత్ర వైద్యునితో ఎప్పటికప్పుడూ పరీక్షలు చేయించుకోండి

  • పడుకునే ముందు ఎల్లప్పుడూ లెన్స్‌లను తీసివేయండి

వేరే వాళ్లతో షేర్‌ చేసుకోవద్దు.
(చదవండి: వర్షాకాలంలో ఆకుకూరలు తినవచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement