'జంక్‌ ఫుడ్‌' ఎంత ప్రమాదకరమో..! మాన్పించాలంటే ఇలా చేయండి!

How Dangerous Is 'Junk Food' Do This To Get Rid Of It - Sakshi

పీజా, బర్గర్, శాండ్‌విచ్, కూల్‌ డ్రింక్స్‌ లాంటి జంక్‌ ఫుడ్స్‌కు అలవాటుపడిన పిల్లలు ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడరు. రోజూ జంక్‌ఫుడ్‌ తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఇది పట్టని పిల్లలు అదే కావాలని మొండికేస్తుంటారు. ఇటువంటి వారిని జంక్‌ఫుడ్‌ని దూరంగా ఉంచాలంటే ఇలా చేయండి చాలు..

ఇష్టమైనవి వండండి..
జంక్‌ఫుడ్‌ పూర్తిగా మాన్పించాలంటే.. ముందుగా పిల్లలు బాగా ఇష్టపడే వంటకాలను వండాలి. పిల్లలు ఏది తినడానికి ఆసక్తి చూపుతున్నారో అవి మాత్రమే వారికి చేసిపెట్టాలి. పెద్దలు తినేదే రోజు పెడితే అది నచ్చక బయట ఫుడ్‌కి అలవాటు పడతారు. ఇంట్లో ఫుడ్‌ మొహం మొత్తకుండా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు ఉపయోగించి బర్గర్స్, పిజ్జాలను ఇంట్లోనే తయారు చేసి పెట్టాలి.

అలవాట్లు..
వీలైనంత త్వరగా పిల్లల ఆహారపు అలవాట్లు మార్చాలి. అలవాట్లు మార్చుకోకపోతే జంక్‌ఫుడ్‌ మానరు. మీరు చేసే ఫుడ్‌ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో వివరిస్తూ, బుజ్జగిస్తూ చెబితే బయట తినే అలవాటును మానుకుంటారు.

పోషకాల గురించి వివరించాలి..
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో పిల్లలకు పెట్టే రకరకాల డిష్‌లను వేటితో తయారు చేశారు, వాటిలో పోషకాలు ఏం ఉంటాయి? అవి శరీరానికి చేసే మేలుని చక్కగా వివరిస్తే ఇంటి ఫుడ్‌ని తినడానికి ఆసక్తి చూపి జంక్‌ ఫుడ్‌ని అస్సలు ముట్టరు. ఈ పద్ధతులను అనుసరిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా మారడం ఖాయం.

ఇవి చదవండి: నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top