పసుపుతో అందం, ఆరోగ్యం, ఈ టిప్స్‌ ఎపుడైనా ట్రై చేశారా? | Home Remedies for beauty and Health Benefits of Turmeric check here | Sakshi
Sakshi News home page

పసుపుతో అందం, ఆరోగ్యం, ఈ టిప్స్‌ ఎపుడైనా ట్రై చేశారా?

Published Sat, Jun 15 2024 6:00 PM | Last Updated on Sat, Jun 15 2024 6:00 PM

Home Remedies  for beauty and Health Benefits of Turmeric check here

పసుపు శుభ్రపదమైందే కాదు ఆరోగ్యంకరమైంది. కూడా. అందుకే భారతీయ వంటకాల్లో, ఇతర ఆహార పదార్థాల తయారీలో విరివిగా వినియోగిస్తారు. వంటింట్లో దివ్యౌషధం పసుపు. యాంటీ బయాటిక్‌, యాంటీ సెప్టిక్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్న పసుపు కేవలం ఆహార పదార్థాల్లోనే కాదు, సౌందర్య పోషణలోనూ  చాలా ఉపయోగపడుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు 
పసుపును ఆహారంలో రెగ్యులర్ చేసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు నుండి దూరంగా ఉండొచ్చట. 
సేంద్రీయ పసుపు వాడటం వల్ల కొన్ని రకాల  కేన్సర్లనుంచి కూడా దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతారు.
చలికాలంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు పసుపు, తులసి, మిరియాల కషాయం బాగా పనిచేస్తుంది. 
జలుబు చేసినపుడు వేడినీటిలో చిటికెడంత పసుపు వేసుకొని ఆవిరి పడితే ఉపశమనం లభిస్తుంది. 
బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది.  చర్మ సమస్యలను తగ్గించడానికి పసుపు చక్కని పరిష్కారం.
పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు  జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు పసుపు తోడ్పడుతుంది.

పసుపుతో అందం

  • పసుపు, పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని, బాగా ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.  ముఖం

  • మృదువుగా కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇదే మిశ్రమాన్న ఒంటికి  నలుగులాగా కూడా వాడుకోవచ్చు. 

  • ముఖం మీది మచ్చలు తొలగి పోవాలంటే.. పసుపు, టమాటా గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.

  • పసుపు, కలబంద గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే ముఖంపై ఉండే ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు.

  • పసుపు, నిమ్మరసం, తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే ముఖంపై ఉండే డార్క్ స్పాట్స్ ,మొటిమలు  పోతాయి.

  • పసుపు, తాజా కలబంద గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే జిడ్డు చర్మం తొలగి ఫ్రెష్‌గా మారుతుంది. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement