Firni: మూడు రోజుల వరకు తాజాగా ఉండేలా ఫిర్ని తయారీ ఇలా!

Holi 2023: Sweet Recipe Firni Making Process In Telugu - Sakshi

ఈ హోలీ రోజు ఇంట్లో వాళ్లకు ఇలా ఫిర్ని చేసిపెట్టండి!
ఫిర్ని తయారీకి కావలసినవి:
►బియ్యం – పావు కప్పు
►వెన్న తీయని పాలు – లీటరు
►చక్కెర – అర కప్పు

►బాదం పప్పు – 10
►పిస్తా – 10
►యాలకుల పొడి – అర టీ స్పూన్‌
►కుంకుమ పువ్వు – 15 రేకలు

►పన్నీరు – 2 టీ స్పూన్‌లు (ఇష్టమైతేనే)
►కిస్‌మిస్‌: 20
►జీడిపప్పు: 10.

తయారీ:
►బియ్యం కడిగి దళసరి బట్ట మీద వేసి నీడలో ఆరబెట్టి, తేమ పోయిన తర్వాత మిక్సీలో గ్రైండ్‌ చేయాలి (మరీ మెత్తగా అక్కరలేదు).
►ఈ లోపు ఒక చిన్న పాత్రలో నీటిని వేడి చేసి అందులో బాదం, పిస్తా వేసి మూత పెట్టాలి.
►అరగంట తర్వాత నీటిని వడపోసి పొట్టు వలిచి, సన్నగా తరగాలి.
►వెడల్పుగా, మందంగా ఉన్న పాత్రలో పాలు మరిగించాలి.

►ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక గరిటెడు పాలను చిన్న పాత్రలోకి తీసుకుని కుంకుమ పువ్వు రేకలు వేసి నానబెట్టాలి.
►పాత్రలో పాలను మరో రెండు నిమిషాల సేపు మరిగించిన తర్వాత మంట తగ్గించి బియ్యప్పిండి, చక్కెర వేసి అడుగు పట్టకుండా, ఉండకట్టకుండా గరిటెతో కలుపుతూ ఉడికించాలి.
►చిక్కబడుతున్నప్పుడు యాలకుల పొడి వేయాలి.
►మిశ్రమం చిక్కబడిన తర్వాత కుంకుమపువ్వు కలిపిన పాలు, బాదం, పిస్తా సగం వేసి కలపాలి.
►ఇవన్నీ వేసిన తర్వాత మరో రెండు లేదా మూడు నిమిషాల సేపు మరగనిచ్చి పన్నీరు వేసి కలిపి స్టవ్‌ ఆపేయాలి.
ఫిర్నీ రెడీ.

ఈ ఫిర్నీని కప్పులో పోసిన తర్వాత మిగిలిన బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించాలి. ఈ ఫిర్నీని గోరువెచ్చగా తినవచ్చు లేదా చల్లబరిచి తినవచ్చు. ఫ్రిజ్‌లో రెండు– మూడు రోజులు తాజాగా ఉంటుంది.  
ఇవి కూడా ట్రై చేయండి: రస్‌మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా..
హోలీకి రైస్‌ ఖీర్‌ తయారు చేసుకోండిలా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top