Rasmalai Sweet Recipe: రస్‌మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా..

Holi 2023: Rasmalai Sweet Easy Recipe In Telugu - Sakshi

తీపిని ఇష్టపడే వారు ఇలా ఇంట్లోనే రస్‌మలై తయారు చేసుకోండి. నోరూరించే స్వీట్‌తో ఈ హోలీని సెలబ్రేట్‌ చేసుకోండి!  
రస్‌మలై తయారీకి కావాల్సినవి:
►రసగుల్లాలు – 15 (ఇంట్లో చేయడం కుదరకపోతే రెడీమేడ్‌వి తీసుకోవచ్చు)
►పాలు – లీటరు
►చక్కెర – 5 టేబుల్‌ స్పూన్‌లు

►బాదం –10 ; పిస్తా– 10
►యాలకుల పొడి– టీ స్పూన్‌
►కుంకుమ పువ్వు – 20 రేకలు

తయారీ:
►అరకప్పు వేడి నీటిలో బాదం, పిస్తాలను అరగంట సేపు నానబెట్టి పొట్టు తీసి తరగాలి.
►పావు కప్పు వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి.
►మందపాటి బాణలిలో పాలు మరిగించాలి.
►పైకి తేలిన మీగడను స్పూన్‌తో తీసి ఒక గిన్నెలో వేసుకుంటూ పాలు అడుగు పట్టకుండా కలుపుతూ, పాలు సగమయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు చక్కెర వేసి కరిగే వరకు కలుపుతూ మరిగించాలి.

►యాలకుల పొడి, బాదం, పిస్తా (సగం), కుంకుమ పువ్వు పాలు కలిపి వీటి రుచి పాలకు పట్టే వరకు సన్నమంట మీద మరిగించాలి.
►ఇప్పుడు రసగుల్లాను ఒక ప్లేట్‌లోకి తీసుకుని గరిటె లేదా అట్లకాడ సాయంతో లేదా వేళ్లతో చక్కెర పాకం జారిపోయేటట్లు మెల్లగా నొక్కాలి.
►ఇలా రసగుల్లాలన్నింటినీ నొక్కి జాగ్రత్తగా పాలలో వేయాలి.
►రెండు నిమిషాలపాటు పాలలో ఉడకనిచ్చి స్టవ్‌ ఆపేయాలి.
►రసమలై చల్లారిన తర్వాత కప్పులో వేసి మీగడ(ఇష్టమైతే), బాదం, పిస్తాలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.  

ఇవి కూడా ట్రై చేయండి: Rice Kheer Recipe: హోలీకి రైస్‌ ఖీర్‌ తయారు చేసుకోండిలా!
Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top