Healthy Breakfast Ideas: బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా.. గుడ్లు, ఓట్‌మిల్క్‌, పండ్లు తీసుకుంటున్నారా?

Healthiest Foods To Eat For Breakfast In Telugu - Sakshi

మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా  తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను కాపాడుతుందన్న ఆరోగ్య నిపుణుల సలహా అందరికీ తెలిసిందే. చెప్తున్నారు. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి తినడం కంటే కూడా బ్రేక్‌ఫాస్ట్‌ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యా ఎదురు కాదు. ఉండదు.

గుడ్లు
ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి బలాన్నిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి.

ఓట్‌ మీల్‌
బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్‌ మీల్‌కు ఓటెయ్యడం ఉత్తమం. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోగలగడమే గాక చాలా ఉత్తమమైనది కూడా. ఎందుకంటే, ఓట్‌ మీల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపు చేయడంలో తోడ్పడతాయి. రక్తపోటు, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్‌ మీల్‌ మంచి బ్రేక్‌ఫాస్ట్‌. ఓట్‌ మీల్‌ను పాలతో కలుపుకొని తినడం లేదా ఉప్మాలా తిరగమోత వేసుకుని తినడం వల్ల ఈ సుగుణాలు అందుతాయి. 
చదవండి: Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి

పండ్లు
మీ రోజు ఫలవంతంగా సాగాలంటే ఉదయాన్నే పొట్టను పండ్లతో నింపేస్తే సరి. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్‌ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్‌ ముక్కలు, లేదా సిట్రస్‌ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్‌ ఏవైనా సరే మంచి బ్రేక్‌ఫాస్ట్‌ జాబితాలో ఉంటాయి.
చదవండి: Health Tips: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్‌.. ఇంకా

నట్స్, సీడ్స్‌
నట్స్‌ తినటానికి రుచిగా ఉండటమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్‌ లో కేలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏ మాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్‌ చాలా ఉపయోగకరం, వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్‌ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం  గుప్పెడు నట్స్‌ తీసుకోవటం ఆరోగ్యకరం. 

అలాగే ఫ్లాక్స్‌ సీడ్స్‌ అంటే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లాక్స్‌ సీడ్స్‌ శరీరంలో షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్‌ ను అందిస్తాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక రోగాలనుంచి రక్షణ లభిస్తుంది. 

ఒక విషయం
సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్‌ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. అందులో భాగంగా పండ్ల రసంతో మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయనే ఉద్దేశ్యంతో నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు.

అయితే ఇలా చేయడం వల్ల మేలు జరగకపోగా, ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ లేదా ఇతర సిట్రస్‌ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్‌ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top