Health Tips In Telugu: Myths About Grahana Morri Cleft Palate - Sakshi
Sakshi News home page

Health Tips: గర్భిణులు గ్రహణ సమయంలో బయట తిరగడం వల్లే అలా జరుగుతుందా?

Nov 6 2022 8:46 AM | Updated on Nov 6 2022 12:31 PM

Health Tips In Telugu: Myths About Grahana Morri Cleft Palate - Sakshi

గ్రహణ మొర్రి ఎందుకు వస్తుంది.. వాస్తవం ఏమిటి?

Health Tips: గర్భిణులు గ్రహణ సమయంలో బయట తిరగడం వల్ల వారికి పుట్టబోయే బిడ్దలకు గ్రహణ మొర్రి వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. వాస్తవం ఏమిటంటే.. గ్రహణ మొర్రి అనేది గ్రహణ సమయంలో గర్భిణులు సరిగా ఉండకపోవడం వల్ల వస్తుందనే దానిలో ఎటువంటి శాస్త్రీయతా లేదు. గ్రహణ మొర్రి అనేది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఓ అవకరం.

దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మెుర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సమయంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సమయంలో ఒక్కోసారి బిడ్డలోని రెండు పెదవులు, అంగిలి కలవవు. అలాంటప్పుడు బిడ్డలో ఈ మెుర్రి ఏర్పడుతుంది. అయితే... శస్త్రచికిత్స ప్రక్రియలు బాగా అడ్వాన్స్‌ అయిన ప్రస్తుత సవుయంలో ఇప్పుడిది సవుస్యే కాదు.

శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మెుర్రి సవుస్యను సవుర్థంగా చక్కదిద్దవచ్చు. గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరమే లేదు. అలాగని గ్రహణ సమయంలో ప్రత్యేకించి బయట తిరగమని చెప్పడం కాదు. అనుమానాలు, అపోహలు మాని మామూలుగానే ఉండవచ్చునని చెప్పడమే ముఖ్యోద్దేశం.
-(చంద్రగ్రహణం రానున్న నేపథ్యంలో) 

చదవండి: Diabetes: షుగర్‌ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్‌ తాగితే 15 నిమిషాల్లో..
Health: పొద్దు పొద్దున్నే ఇబ్బంది.. మలబద్దకానికి కారణం ఏమిటి? పరిష్కారాలు.. ఉడికించిన పప్పు తింటే

Advertisement
 
Advertisement
Advertisement