Health: పొద్దు పొద్దున్నే ఇబ్బంది.. మలబద్దకానికి కారణం ఏమిటి? పరిష్కారాలు.. ఉడికించిన పప్పు తింటే

Health Tips Get Rid Of Constipation Malabaddakam By Ayurvedic Expert - Sakshi

పొద్దునే రావడం లేదా? 

మలబద్దకానికి కారణం ఏమిటి? 

దాన్నించి ఎలా బయట పడాలి?

Health Tips In Telugu: మన జీవన శైలి సరిగా లేకపోవడం వలన వచ్చే అనారోగ్యమే మలబద్ధకం. నిజం చెప్పాలంటే దీనికి మందు లేదు. కానీ పరిష్కారాలున్నాయి.

మలబద్దకం నివారణ- పరిష్కారాలు
1. రోజూ అరగంట నుంచి గంట  పాటు మంచి వ్యాయామము చేయండి.
2. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి.
3. దుంప కూరలు, వేపుడు కూరలు, శీతల పానీయాలు, ఐస్‌ క్రీమ్‌లు పూర్తిగా పక్కన పెట్టండి. తేలికగా జీర్ణమయ్యే భోజనం తినండి. ఉడికించిన పప్పు కూడా తినవచ్చు.  

4.ఆహారంలో పీచుపదార్థాలు లేకపోవడం, మంచినీరు తక్కువ తాగడం, తగినంత వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి గల జీవన శైలి, థైరాయిడ్, కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల మందులు అతిగా వాడడం వల్ల మలబద్ధకం వస్తుంది.
5. ఆహారం లో పండ్లు, కూరగాయలు చేర్చుకోవడం. కూరలు, తాజా పళ్ళు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలాగే వ్యాయామము ఎంత చేస్తే అంత త్వరగా మల బద్దకం నుంచి బయటపడతారు. 

6. నీళ్లు కూడా బాగా తాగండి. రోజూ 3 నుంచి 4 లీటర్ల మంచినీరు తీసుకోవడం మంచిది. 
7. ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. చేసే పనులు ప్రశాంతంగా, నిదానంగా చేయండి. ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయాలనుకోవడం, ఏదీ సరిగా చేయలేకపోతే ఒత్తిడికి గురికావడం లాంటి వాటికి దూరంగా ఉండండి.

9. ఏవైనా ఇతరత్రా వ్యాధులు ఎక్కువ రోజులు ఉన్నట్టయితే మీ సమస్యను డాక్టర్లు తో చర్చించండి. ఒక దానికొకటి తోడయినట్టు సమస్యను పెంచే అవకాశం ఉంటుంది. 

సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి?
1. ఉదయం నిద్ర లేవగానే  బ్రష్ చేసుకున్న తర్వాత ఒక ఆపిల్ తినండి. 
2. తరువాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ సముద్రపు ఉప్పు కలిపి తాగండి. ఒక అరగంటలో మోషన్స్ అవుతాయి.

అసలు వద్దు
మీ సమస్యని బట్టి నెలకు ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే చేయండి. అంతకు మించి పాటించరాదు. మీకు వీలుంటే ఒక 15 రోజులు మంచి ప్రకృతి ఆశ్రమంలో గడపండి. మీకు ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. తెలిసీ తెలియక ఉన్న చాలా ఇతర రోగాలు కూడా పోతాయి. 
-డాక్టర్‌ నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు.

చదవండి: Diabetes- Best Diet: షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం చేయాలి? ఉత్తమమైన ఆహారం ఇదే!.. దేశీ ఫలాలు తింటే
ఊపిరితిత్తులు భద్రం.. పోస్ట్‌ కోవిడ్‌తో ఎన్నో సమస్యలు.. వ్యాధులను గుర్తించడం ఎలా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top