Health Tips: రోజూ క్యారెట్‌ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల..

Health Tips In Telugu: Carrot Health Benefits Helpful In Reduce Cholesterol - Sakshi

క్యారెట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మొక్కల ఆధారిత ఆహారాలు వాస్తవానికి అధిక కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి, నిర్వహించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణుల అధ్యయనాలలో తేలింది.

క్యారెట్‌లో సహజంగా ఖనిజాలు, విటమిన్లు, కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యారెట్‌లోని విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్, దీర్ఘకాలిక గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
వాస్తవానికి, యాంటీ ఆక్సిడెంట్ల ఉనికి కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.
అందువల్ల క్యారట్‌ తీసుకోవడం వల్ల చెడు కొలస్ట్రాల్‌ స్థాయులు తగ్గిపోతాయి.  

క్యారెట్‌ సూప్‌ చేసుకోండిలా!
కావల్సినవి:  
క్యారెట్లు – 3 (శుభ్రపరిచి, ముక్కలు చేయాలి)
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి)
చిలగడ దుంప – 1 (తొక్క తీసి, ముక్కలు చేయాలి)
వెల్లుల్లి రెబ్బలు – 2 (తరగాలి), కొత్తిమీర – పావు కప్పు
నీళ్లు – తగినన్ని, కూరగాయలు ఉడికించిన నీళ్లు – కప్పు
టొమాటో గుజ్జు – అర కప్పు, పండుమిర్చి ముద్ద – పావు టీ స్పూన్
ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, నూనె – టేబుల్‌ స్పూన్‌

తయారీ: 
క్యారెట్లు, ఉల్లిపాయలు, చిలగడదుంప, వెల్లుల్లి, కొత్తిమీర ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి.
ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి.
నీళ్లు వడకట్టి కూరగాయల ముక్కలన్నీ మెత్తగా రుబ్బాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగాక టొమాటో గుజ్జు, పండుమిర్చి ముద్ద, ఉప్పు, కారం కలిపి ఉడికించాలి. దీంట్లో కూరగాయలు వడకట్టిన నీళ్లు, రుబ్బిన మిశ్రమం కలిపి, మిరియాల పొడి వేసి ఉడికించాలి.
చివరగా కొత్తిమీర చల్లి వేడి వేడిగా అందించాలి.

చదవండి: C- Section Wound Infection: సిజేరియన్‌.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా?
Detoxification: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన.. శరీరంలోని విషాలు తొలగించుకోండిలా! ఇవి తింటే మాత్రం..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top