Watermelon Health Benefits: ఎండలో బయలుదేరే ముందు పుచ్చకాయ ముక్కలు తిన్నారంటే..

Health Tips: Amazing Benefits Of Watermelon Puchakaya In Telugu - Sakshi

ప్రపంచవ్యాప్తంగా దొరికే పుచ్చకాయలు వేసవితాపాన్ని తీర్చుకోవడానికి బాగా పనికొస్తాయి. ఏ వేళలోనైనా తీసుకోవడానికి అనువుగా ఉంటాయి. పుచ్చకాయలు దాదాపు సంవత్సరమంతా దొరికేవే అయినా, వేసవిలో వీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండలో బయలుదేరే ముందు కాసిని పుచ్చకాయ ముక్కలు తిన్నట్లయితే వడదెబ్బ నుంచి రక్షణగా ఉంటుంది.

పుచ్చకాయల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
ఎండ వల్ల కమిలిపోయిన చర్మానికి పుచ్చకాయ గుజ్జు పట్టిస్తే త్వరగా మానుతుంది.
మిగిలిన పండ్ల కంటే పుచ్చకాయల్లో నీటిశాతం చాలా ఎక్కువ కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఫలహారంగా పనికొస్తాయి.
పుచ్చకాయల్లో పుష్కలంగా ఉండే బీటాకెరోటిన్లు కంటిచూపు సమస్యలను నివారిస్తాయి.
ఇందులోని విటమిన్లు, ఖనిజలవణాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
పుచ్చకాయ ముక్కలను తీసుకున్నా, పుచ్చకాయ రసాన్ని తీసుకున్నా మంచిదే. 

చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top