జై భజరంగ భళీ!

Hanuman Flying In The Sky Is Viral - Sakshi

వైరల్‌

ఆకాశంలోకి చూస్తే గాల్లో ఎగురుతున్న హనుమంతుడు కనిపిస్తే ఎంత వింత! ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఇలాంటి దృశ్యమే కనిపించి ప్రజలను ఆశ్చర్యానందాలకు గురి చేసింది.  ఆ నగరంలోని ఒక ఉత్సవ కమిటీ వాళ్లు గాల్లో ఎగురుతున్నట్లు ఉండే హనుమాన్‌ రూపాన్ని డ్రోన్‌కు బిగించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అయింది. కొన్ని సంవత్సరాల క్రితం పంజాబ్‌లోని లుథియానాలో ఇలాంటి దృశ్యమే కనువిందు చేసింది. దానినుంచి స్ఫూర్తి పొంది ఈ వీడియో చేశారేమో తెలియదుగానీ ప్రజలు మాత్రం ఆకాశానికేసి చూస్తూ ‘జై భజరంగభళీ’ అంటూ నినదించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top