Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనెతో

Hair Care Tips For Rainy Season In Telugu - Sakshi

రాబోయేది వర్షాల సీజన్‌. ఈ కాలంలో కురులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాలి. వర్షంలో తడిచినా వెంటనే తలస్నానం చేసి జుట్టుని ఆరబెట్టాలి.

జుట్టుకు ఆయిల్‌ పట్టించి గంటతరువాతే తలస్నానం చేయాలి.

అదే విధంగా... వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేయాలి. నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసంలో మరో నాలుగు టీస్పూన్ల కొబ్బరి నూనె వేసి కలిపి జుట్టు  కుదళ్ల నుంచి చివర్లకు పట్టించాలి.

అరగంట తరువాత తలస్నానం చేయాలి.  ఇవన్నీ పాటించడం ద్వారా వర్షాకాలంలోనూ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

చదవండి👉🏾: Hair Care Tips: వాల్‌నట్స్‌ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌ వల్ల

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top