ముక్కలుగా.. ఆ తర్వాత పేస్ట్‌లా మార్చే మాన్యువల్‌ చాపర్‌

Fruits And Vegetables Cut Into Multiple Pieces By Manual Chopper - Sakshi

కూరగాయలను, పండ్లను అవసరాన్ని బట్టి, ఇట్టే ముక్కలుగా, పేస్ట్‌లా అందించే మాన్యువల్‌ చాపర్‌ ఇది. దీనికి పవర్‌తో పని లేదు. మల్టీ–బ్లేడ్‌ డిజైన్‌ కలిగిన ఈ డివైజ్‌లో పండ్లు లేదా కూరగాయలు ఈ బౌల్‌లో వేసుకుని.. మూత పెట్టి, ఆ మూత పైభాగంలో ఉన్న రెడ్‌ లేదా గ్రీన్‌ కలర్‌ హ్యాండిల్‌ని ఒక చేత్తో పట్టుకుని, మూతపైన మరో చేయి వేసి నొక్కి పెట్టి.. హ్యాండిల్‌ని ఫోర్స్‌గా మనవైపుకి లాగితే.. లోపల ఉన్న పదార్థాలు ముక్కలు ముక్కలుగా అవుతాయి.

అలా అయిదుసార్ల కంటే ఎక్కువ లాగితే కూర తయారీకి సరిపడా ముక్కల్లా, ఎనిమిదిసార్ల కంటే ఎక్కువ లాగితే చట్నీలా, పన్నెండుసార్ల కంటే ఎక్కువ లాగితే జ్యూస్‌లా మారుతుంది. టొమాటో, ఆనియన్, కొత్తిమీర, నిమ్మరసం, మిరియాల పొడి వేసుకుని స్పైసీ సల్సా తయారు చేసుకోవచ్చు. తులసి, పైన్‌ నట్స్, వెల్లుల్లి, లవంగాలు, ఆలివ్‌ నూనె వేసుకుని పర్ఫెక్ట్‌ పెస్టో రెడీ చేసుకోవచ్చు. బనానా, స్ట్రాబెర్రీ, పైనాపిల్‌ ముక్కల్లో పెరుగు, తేనె వంటివి జోడించి టేస్టీ జ్యూస్‌ చేసుకోవచ్చు. భలే బాగుంది కదూ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top