మామిడిపళ్లు తినేముందు ఇవి పాటించడం మర్చిపోకండి

Before Eat Mangoes You Need To Know This Steps - Sakshi

మామిడి పండ్లను తినేముందు వాటిని కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలని అమ్మమ్మలు, నానమ్మలు సలహా ఇస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే, మామిడిపండ్లలో ఫైటిక్‌ ఆమ్లం ఉత్పత్తి అవుతుంటుంది. ఇలా అధికంగా ఉత్పత్తి అయ్యే ఈ యాసిడ్‌ను తొలగించడానికి నీళ్లలో నానబెట్టాలి.

వివిధ కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి వాటిలో ఈ ఫైటికి యాసిడ్‌ ఉంటుంది. ఇలా నానబెట్టడం వల్ల అది విచ్ఛిన్నమైపోతుంది. ఈ ఫైటిక్‌ యాసిడ్‌ అదనపు వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. నీటిలో నానడం వల్ల ఈ అదనపు వేడి తగ్గిపోతుంది. 

టాక్సిన్లను తొలగిస్తుంది
మామిడి పండ్లను తినడానికి ముందు గంటపాటు నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి తొక్కపై ఉండే కనిపించని నూనె తొలగిపోతుంది. అది కొందరిలో ఎలర్జీలు కలిగించే అవకాశం ఉంది. అలాగే పాలీఫెనాల్స్, టానిన్లు వంటి సూక్ష్మ పదార్థాల మిశ్రమం తొక్క పైన ఉండే అవకాశం ఉంది. అవి శరీరంలో చేరితే దురద, బొబ్బలు రావడానికి కారణం అవుతుంది. మామిడిపండ్లు నానబెట్టడం వల్ల అవన్నీ తొలగి పండు తినడానికి అనువుగా సురక్షితంగా మారుతుంది.

మామిడి పండ్లను ఇలా నీటిలో నానబెట్టడం వల్ల వాటి రుచి కూడా బాగుంటుంది. ప్రత్యేకించి ఆ పండ్లను ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే వాటిని కచ్చితంగా నీళ్ళల్లో నానబెట్టాలి. ఎందుకంటే ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఆ పండులో ఉండే కొన్ని సమ్మేళనాలు పండు వాసనను, రుచిని మార్చేస్తాయి. నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి సహజమైన తీపి, సువాసనను తిరిగి పొందవచ్చు.
చదవండి: International Jazz Day: జాజ్‌ జాజిమల్లి

  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top