భర్త హఠాన్మరణం.. ఇద్దరు బిడ్డల భారం.. ఆమెను నిలబెట్టిన ఆంగ్లం | Delhi: Kamna Mishra Motivational Speaker Inspirational Journey In Telugu | Sakshi
Sakshi News home page

Kamna Mishra: భర్త హఠాన్మరణం.. ఇద్దరు బిడ్డల భారం.. ఆమెను నిలబెట్టిన ఆంగ్లం

Jul 6 2022 2:21 PM | Updated on Jul 6 2022 2:34 PM

Delhi: Kamna Mishra Motivational Speaker Inspirational Journey In Telugu - Sakshi

ఆమెను నిలబెట్టిన ఆంగ్లం

వెనుకటి రోజుల్లో.. కాస్త చదువుకున్న అమ్మాయి అయితే పుట్టే పిల్లలకు చదువు చెప్పగలుగుతుందన్న ఉద్దేశ్యంతో చదువుకున్న అమ్మాయిల్ని కోడలిగా చేసుకునేందుకు ఇష్టపడేవారు. ఇలా ఇష్టపడి చేసుకున్న ఓ కోడలే కామ్నా మిశ్రా.

‘‘అత్తింటివారు ఎంతో ఇష్టపడి చేసుకున్నారు. ఇంకేం... నా జీవితం సంతోషంగా గడిచిపోతుంది అనుకుంది కామ్నా, కానీ అనుకోని సమస్యలతో అంతా తలకిందులైంది. అయినప్పటికీ తనకున్న నైపుణ్యాలతో చితికిపోయిన కుటుంబాన్ని నిలబెట్టి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.

ఢిల్లీలో పుట్టి పెరిగిన కామ్నా మిశ్రా చిన్నప్పటి నుంచి చదువులోనూ, ఆటపాటల్లోనూ ఎంతో చురుకుగా ఉండేది. ఆంగ్లం అంటే అమిత మక్కువ. మంచి మార్కులతో డిగ్రీ పాస్‌ కావడంతో ఆమె గురించి తెలిసిన వాళ్లు కోరికోరి ఆమెను తమ ఇంటికోడలుగా చేసుకున్నారు. 

జైలు లాంటి ఇల్లు..
జీవితం ఎంతో చక్కగా ఉంటుందన్న కలలతో అత్తారింట్లో అడుగు పెట్టింది కామ్నా. అయితే, అత్తింటి వారి  ఆంక్షలు, ఆరళ్లతో ఆమె సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ వార్తాపత్రికలు, కథలు చదవడం, రాయడంతోపాటు చుట్టుపక్కల పిల్లలకు పాఠాలు కూడా చెప్పేది.

ఇంతలో కామ్నాకు ఊహించని విపత్తు పాతాళానికి తొక్కేసినట్లు అనిపించింది. భర్త హఠాన్మరణంతో.. ఇద్దరు పసిబిడ్డల భారం ఆమెపై పడింది. 

కాలానికి తగ్గట్టుగా...
భర్త అకాల మరణంతో కుటుంబ భారాన్ని మోయక తప్పని పరిస్థితి ఎదురైనప్పటికీ ఏ మాత్రం భయపడలేదు కామ్నా. ఇంటికి దగ్గరల్లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్, వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పేది. ఇలా మూడేళ్లపాటు వివిధ రకాల ఇన్‌స్టిట్యూట్స్‌లో పనిచేసాక ..కామ్నా సొంతంగా ఇన్‌స్టిట్యూట్‌ను తెరిచింది.

దీనిద్వారా అనేకమందికి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ పాఠాలను బోధించడం సాధ్యమైంది. గృహిణులు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇంగ్లిష్‌తోపాటు, డ్యాన్సింగ్, యాక్టింగ్‌ వంటివి కూడా నేర్పిస్తోంది. మోటివేషనల్‌ స్పీకర్‌గా పనిచేస్తోంది. ఇందుకోసం తను కూడా నిరంతరం చదువుకుంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. 

వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
‘‘అమ్మాయిల విషయంలో సమాజం మారాల్సిన అవసరం ఉంది. ప్రతి అమ్మాయికి తనకు నచ్చిన విధంగా బతికే హక్కు ఉంది. కలలను కలలుగానే కూలిపోనివ్వవద్దు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలి.

ఏదైనా నేర్చుకోవడానికి వయసుతో పనిలేదు. ఎక్కడైనా, ఎక్కడి నుంౖచెనా కొత్తవాటిని నేర్చుకోవాలి. అప్పుడే జీవితం రంగుల మయం అవుతుంది. అందుకు నా జీవితమే ఉదాహరణ’’. – కామ్నా మిశ్రా 

చదవండి: తల్లి నగలు తాకట్టు పెట్టి గెర్బెరా పూలను సాగు చేశారు.. లక్షలు సంపాదిస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement