చార్జింగ్‌తో పాటు డేటా స్టోరేజ్‌

Data storage along with charging - Sakshi

చార్జింగ్‌తో పాటు డేటా స్టోరేజ్‌ చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం ఒకేసారి రెండుపనులు చేస్తుంది. రీచార్జబుల్‌ బ్యాటరీతో ఈ పరికరం పోర్టబుల్‌ చార్జర్‌లా పనిచేస్తుంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి వాటిని చార్జింగ్‌ చేసుకోవచ్చు. పరికరాలను చార్జింగ్‌ చేస్తున్న సమయంలోనే, వాటిలోని ముఖ్యమైన డేటాను కూడా ఇందులో భద్రపరచుకోవచ్చు.

ఇది సైనిక అవసరాల కోసం ఉపయోగించే ‘ఏఈఎస్‌–256’ ఎన్‌క్రిప్షన్‌ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది ఏకకాలంలో రెండు పరికరాలకు 65 వాట్ల విద్యుత్తును సరఫరా చేస్తూ చార్జింగ్‌ చేయగలదు. అలాగే, 1000 ఎంబీపీఎస్‌ వేగంతో డేటాను స్టోర్‌ చేసుకోగలదు. డేటా స్టోరేజ్‌ సామర్థ్యం ప్రకారం ‘మెమ్‌కీపర్‌’ పేరుతో చైనాకు చెందిన మెమ్‌కీపర్‌ టెక్‌ కంపెనీ రూపొందించిన ఈ పరికరం మూడు మోడల్స్‌లో– 256 జీబీ, 512 జీబీ, 1టీబీ మోడల్స్‌లో దొరుకుతుంది. మోడల్‌ను బట్టి ఈ పరికరం ధర 99 డాలర్ల నుంచి 132 డాలర్ల (రూ.8,214 నుంచి రూ.10,957)వరకు ఉంటుంది.

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top