
కొండ కొనల్లో నివసించి..అడవి తల్లిని నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగించే డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలు వారి సంప్రదాయాలను గౌరవిస్తు ఆధునిక పద్ధతిలో వివాహాలు చేసుకుని తమదంటూ నాగరికతను చాటుకుంటున్నారు. ఒకప్పుడు వివాహాలు వారి సంప్రదాయాల ప్రకారం గుట్టు చప్పుడు లేకుండా జరిగేవి. నచ్చిన యువతిని తీసుకువచ్చిన వరుడు తమ పెద్దల సమక్షంలో వివాహం చేసుకునే వారు. ఆచార వ్యవహారాల ప్రకారం వారి ఇద్దరిని వివాహం చేసేవారు పెద్దలు. కాని అందుకు భిన్నంగా నేటి యువత వివాహాలను ఆర్భాటంగా కొనసాగిస్తున్నాయి.
వివాహాల్లొ ఆధునికత ఊరేగింపులు విందు, వినోదాలతో పాటు సంప్రదాయ నృత్యాలతో వివాహాలు కొనసాగుతున్నాయి. వధువు, వరుని తరఫున పెండ్లి కి ఆహ్వానించే కార్డులను ముద్రించి వారి బంధువులను ఆత్మీయులను ఆహ్వానించడం కనిపిస్తుంది. జిల్లాలొని బిసంకటక్ సమితి కుర్లి గ్రామంలొ డ్రేకు జకసిక కొడకు సేతు జకసిక అదే గ్రామానికి చెందిన బండీ వడక కూతురు వనిత వడకతొ వివాహం నిశ్చయమయ్యింది .
ఈ క్రమంలో వివాహం సొమవారం నాడు జరిగింది. వరుడుకి ముకుటం ధరించి డిజే సౌండ్ ల మధ్య వరుడి ఊరేగింపు కార్యక్రమం అందరిని ఆకర్షించింది. యువత నృత్యాలతో కొనసాగిన ఊరేగింపులో భాగంగా సాంప్రదాయమైన ఆదివాసీ నృత్యా లు కూడా చోటు చేసుకున్నాయి. సుమారు 5 వేల మంది బంధువుల మధ్య వివాహాం జరిగింది. ఇంతటి ఆర్భాటంగా వివాహం జరగడంతో డొంగిరియా తెగన్లో ఇదే ప్రధమమని చెప్పాలి.
(చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్..! బతకదు అనుకున్న భార్యను..)